TVS iQube S : భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటైన టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) తన విభాగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మరింత శక్తివంతమైన బ్యాటరీతో కూడిన TVS iQube S 4.7kWh కొత్త మోడల్‌ను టీవీఎస్ మోటార్స్ అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త వేరియంట్ రాకతో ఈవీ ప్రియులకు రేంజ్ విషయంలో ఉన్న ఆందోళనలు పూర్తిగా తొలిగిపోనున్నాయి.
ధర , మెరుగైన రేంజ్ (TVS iQube S) సామర్థ్యం
కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7kWh మోడల్ ధర ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 1,37,142 గా నిర్ణయించబడింది. ఈ స్కూటర్ యొక్క అతిపెద్ద ఆకర్షణ దాని రేంజ్. ఇందులో అమర్చిన 4.7kWh భారీ బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 175 కిలోమీటర్ల (IDC) దూరం ప్రయాణిస్తుంది. (TVS iQube S) దీనివల్ల నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారే కాకుండా, అప్పుడప్పుడు సుదూర ప్రాంతాలకు లేదా ప్లాన్ లేని ఆకస్మిక ప్రయాణాలు చేసే వారికి కూడా ఇది ఒక గొప్ప భరోసాగా నిలుస్తుంది.

స్టైలిష్ లుక్.. ఆకట్టుకునే కొత్త రంగులు
ప్రస్తుత తరం వినియోగదారులు ఫీచర్లతో పాటు లుక్స్‌కు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుండటంతో, టీవీఎస్ ఈ మోడల్‌ను ఆకర్షణీయమైన రంగుల్లో తీసుకొచ్చింది. మునుపటి రంగులతో పాటు ఇప్పుడు మ్యాగ్నిఫిసెన్స్ పర్పుల్ బేజ్, హార్లెకిన్ బ్లూ బేజ్ అనే రెండు సరికొత్త డ్యూయల్ టోన్ రంగులను పరిచయం చేశారు. వీటితో పాటు హుందాతనాన్ని కోరుకునే వారి కోసం టైటానియం గ్రే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త రంగులు స్కూటర్‌కు మరింత ప్రీమియం లుక్‌ను జోడించాయి.
మూడు ప్రధాన సూత్రాలతో మెరుగైన ప్రయాణం
ఈ కొత్త స్కూటర్‌ను టీవీఎస్ మోటార్స్ మూడు ముఖ్యమైన అంశాల ఆధారంగా రూపొందించింది. మొదటిది ‘ఎంపిక చేసుకునే స్వేచ్ఛ’ (Power of Choice). దీని ద్వారా వినియోగదారులు తమకు కావలసిన రేంజ్, కనెక్టెడ్ ఫీచర్లు , రంగులను తమ అభిరుచికి తగ్గట్టుగా ఎంచుకోవచ్చు. (TVS iQube S) రెండవది ‘మనశ్శాంతి’ (Peace of Mind). భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, పారదర్శకమైన కొనుగోలు అనుభవాన్ని , నమ్మకమైన సర్వీస్‌ను అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇక మూడవది ‘నిర్వహణలో సరళత’ (Simplicity of Operating). ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పటికీ, స్కూటర్‌ను నడపడం , దాని ఫీచర్లను ఉపయోగించడం అత్యంత సులభంగా ఉండేలా డిజైన్ చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రతి సామాన్యుడికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా టీవీఎస్ తన సేవలను విస్తరించింది. ప్రస్తుతం TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశవ్యాప్తంగా 1,000 పైగా నగరాల్లో, దాదాపు 3,300 డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. ఫ్యామిలీ ఈవీగా (Family EV) ఇప్పటికే ఘనవిజయం సాధించిన ఐక్యూబ్, ఈ కొత్త 4.7kWh మోడల్‌తో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.














