Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత దశాబ్ద కాలానికి పైగా బెంగాల్‌ను ఏలుతున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది. తన సొంత ఇలాకాగా భావించే భవానీపుర్ నియోజకవర్గంలో ఆమె ఓటమి పాలవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భవానీపుర్‌లో మళ్లీ సువేందు (Mamata Banerjee) అధికారి హవా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి సువేందు అధికారి చేతిలో పరాజయం చెందారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సువేందు అధికారి సుమారు 15 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో మమతపై విజయం సాధించారు. (Mamata Banerjee) 2021 ఎన్నికల్లో కూడా నందిగ్రామ్ వేదికగా మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే ఫలితం రిపీట్ అవ్వడం గమనార్హం.

బెంగాల్‌లో ఎగిరిన కాషాయ (Mamata Banerjee) జెండా
ఈసారి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ మెజార్టీతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 200కు పైగా సీట్లలో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రధాని మోదీ, అమిత్ షా నేతృత్వంలో సాగిన ఎన్నికల ప్రచారం బీజేపీకి భారీ మైలేజీని తెచ్చిపెట్టింది.
కుప్పకూలిన తృణమూల్ కాంగ్రెస్ కోట
మరోవైపు, అధికార టీఎంసీ ఈ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. మమతా బెనర్జీ ఛరిష్మా ఈసారి ఆ పార్టీని కాపాడలేకపోయింది. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటి వరకు కేవలం 72 స్థానాల్లోనే విజయం సాధించగా, మరో 7 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. మెజార్టీ మార్కుకు చాలా దూరంలో టీఎంసీ ఆగిపోవడంతో బెంగాల్‌లో మమత పాలనకు తెరపడినట్లయింది.
ఈ ఫలితాలతో బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఒకప్పుడు తిరుగులేని నాయకురాలిగా వెలిగిన ‘దీదీ’ తన సొంత స్థానంలోనే ఓడిపోవడం ఇంకా పార్టీ అధికారాన్ని కోల్పోవడం టీఎంసీ శ్రేణులను తీవ్ర నిరాశలో ముంచెత్తింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మమత ఓటమిపై స్పందిస్తూ ఆమెకు తన సానుభూతిని తెలియజేశారు.














