REDMAGIC 11S Pro : గేమింగ్ మొబైల్స్ అంటే గుర్తొచ్చే బ్రాండ్ రెడ్‌మ్యాజిక్ (REDMAGIC). ఈ సంస్థ ఇప్పుడు తన మోస్ట్ పవర్‌ఫుల్ REDMAGIC 11S Pro సిరీస్‌ను మే 18న చైనాలో లాంచ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ కొత్త ఫోన్ డిజైన్ చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. మునుపటి సిరీస్‌లో సక్సెస్ అయిన ‘డ్యూటీరియం బ్లేడ్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్’ను ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఫోన్ కేవలం లుక్ పరంగానే కాదు, పర్ఫార్మెన్స్ లో కూడా రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది.
రికార్డ్ బ్రేకింగ్ ప్రాసెసర్, (REDMAGIC 11S Pro) పర్ఫార్మెన్స్
ఈ సిరీస్ ఫోన్లలో Snapdragon 8 Elite Gen 5 Leading Edition ప్రాసెసర్‌ను వాడుతున్నారు. దీని పవర్ ఎలా ఉంటుందో చెప్పడానికి గీక్‌బెంచ్ (Geekbench) స్కోర్లే నిదర్శనం. REDMAGIC 11S Pro+ మోడల్ సింగిల్ కోర్ టెస్టులో 4010 స్కోర్ సాధించి, ఈ మైలురాయిని దాటిన (REDMAGIC 11S Pro) తొలి ఆండ్రాయిడ్ ఫోన్‌గా నిలిచింది. ఇక మల్టీ కోర్‌లో 11187 స్కోర్ సాధించి తన సత్తా చాటింది. అంటే గేమింగ్ ఆడేటప్పుడు ఎక్కడా లాగ్ అనే మాటే వినిపించదు.

డ్యూయల్ కూలింగ్ సిస్టమ్.. హీటింగ్ కు నో ఛాన్స్
హెవీ గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కడం కామన్, కానీ రెడ్‌మ్యాజిక్ దీనికోసం ఒక అదిరిపోయే సెటప్ ప్లాన్ చేసింది. ఇందులో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ తో పాటు వాటర్ కూలింగ్ డిజైన్ కలిపి ‘డ్యూయల్ కూలింగ్ సిస్టమ్’ను ఇస్తున్నారు. దీనివల్ల లాంగ్ అవర్స్ గేమింగ్ సెషన్స్ లో కూడా ఫోన్ చల్లగా ఉంటుంది. సిల్వర్ వింగ్ , డార్క్ నైట్ అనే రెండు అదిరిపోయే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.
Read Also : Warren Buffett : వారెన్ బఫెట్ విజయ రహస్యం.. అమ్మ పెట్టిన కఠిన నియమాలే ఆయనను ప్రపంచ కుబేరుడిని చేశాయా.?
డిస్‌ప్లే , విజువల్ ఎక్స్‌పీరియన్స్
గేమర్ల కోసం ఇందులో 6.85 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనికి తోడు 2K సూపర్ రెజల్యూషన్ , సూపర్ ఫ్రేమ్ సపోర్ట్ ఉండటం వల్ల విజువల్స్ చాలా స్మూత్ గా , క్లారిటీగా ఉంటాయి. గేమింగ్ ఆడేటప్పుడు ప్రతి మూమెంట్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది.
బ్యాటరీ , ఛార్జింగ్ స్పెసిఫికేషన్స్
బ్యాటరీ విషయంలో రెడ్‌మ్యాజిక్ తన పాత రికార్డులను తానే బ్రేక్ చేస్తోంది.. REDMAGIC 11S Pro+ లో 7500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ , 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. REDMAGIC 11S Pro మోడల్‌లో ఏకంగా 8000mAh భారీ బ్యాటరీ , 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉండబోతోంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి గేమింగ్ ఆడుకోవచ్చు. మే 18న జరగబోయే లాంచ్ ఈవెంట్ లో ఈ ఫోన్ ధర , మరిన్ని ఫీచర్లు బయటకు వస్తాయి. గేమింగ్ అంటే పిచ్చి ఉన్న వాళ్లకు ఈ 11S Pro సిరీస్ ఒక పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు.













