తాజా వార్తలు

CM Revanth Reddy : ఉద్యోగులకు ‘రేవంత్’ భరోసా.. వంద రోజుల్లో రూ. 6 వేల కోట్ల బకాయిల చెల్లింపు..!

cm-revanth-reddy

CM Revanth Reddy :రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి, తమది ముమ్మాటికీ ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వమని, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల చిరకాల వాంఛలైన పీఆర్సీ, హెల్త్ కార్డులు , పెండింగ్ బిల్లులపై సీఎం కీలక ప్రకటనలు చేశారు.

ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. మీ సమస్యల (CM Revanth Reddy) బాధ్యత మాది

ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని ఉద్యోగులు తమ భుజాన వేసుకుని పని చేస్తున్నారని, వారి సహకారంతోనే సంక్షేమ పథకాలు విజయవంతంగా (CM Revanth Reddy) అమలవుతున్నాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల శ్రేయస్సు కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నామని, ప్రతి నెలా ఒకటో తారీఖున వేతనాలు అందేలా చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. అలాగే ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించామని పేర్కొన్నారు.

cm-revanth-reddy-1

వంద రోజుల్లో రూ. 6 వేల కోట్ల (CM Revanth Reddy) రిటైర్మెంట్ బెనిఫిట్స్

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ముఖ్యమంత్రి భారీ ఊరటనిచ్చారు. వచ్చే వంద రోజుల్లో (CM Revanth Reddy) రూ. 6 వేల కోట్ల రూపాయలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధులను ఏ విధంగా ఖర్చు చేయాలి, ప్రాధాన్యతలు ఎలా ఉండాలి అనే నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలకే వదిలేస్తున్నట్లు సీఎం ప్రకటించడం విశేషం.

Read Also : Good News : తిరుమల భక్తులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్ 3 ప్రత్యేక రైళ్లు..!

పీఆర్సీ రిపోర్టుపై తక్షణ ఆదేశాలు.. జూన్ 1 నుంచి హెల్త్ కార్డులు

ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ (PRC) పై తక్షణమే రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని సీఎం ఆదేశించారు. ఆ రిపోర్టు ఆధారంగానే పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం జూన్ 1 లోగా అందరికీ హెల్త్ కార్డులను పంపిణీ చేయాలని అధికారులకు గడువు విధించారు. ప్రతి రెండు నెలలకోసారి గుర్తింపు పొందిన సంఘాలతో సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలని సూచించారు.

Read Also : IPL 2026 Playoffs : రేసులో దూసుకెళ్తున్న జట్లు ఇవే.. ఆ ముగ్గురు ఇంటికేనా?

రెండేళ్లలో 67,760 ఉద్యోగాల నియామకం

ప్రజా ప్రభుత్వ హయాంలో నిరుద్యోగితను రూపుమాపేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని, ఈ రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

గత పదేళ్ల బకాయిలను క్లియర్ చేస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల రూపాయల ఉద్యోగుల బిల్లులు పేరుకుపోయాయని విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి పెండింగ్ బిల్లులు ఏమీ లేవని, కానీ పదేళ్లలో పరిస్థితి దారుణంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ. 6 వేల కోట్ల పెన్షనర్ బకాయిలను 100 రోజుల్లో క్లియర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మానవీయ దృక్పథంతో ఆలోచించి హెల్త్ కార్డులు, వేతనాల చెల్లింపుపై ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారని భట్టి విక్రమార్క కొనియాడారు.

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.