Mission Drishti : భారతీయ అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేటు అంకుర సంస్థలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో దేశ కీర్తిని చాటుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష అంకుర సంస్థ ‘గెలాక్స్‌ఐ’ రూపొందించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘దృష్టి’ ఉపగ్రహం (Mission Drishti) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ప్రయోగ కేంద్రం నుండి స్పేస్ఎక్స్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన ఫాల్కన్-9 రాకెట్ సాయంతో ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. భూ పరిశీలన సాంకేతిక పరిజ్ఞానంలో (Earth Observation Technology) ఈ ప్రయోగం ఒక కీలక మైలురాయిగా నిలవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారత్ తన సత్తాను చాటిచెప్పింది.
ప్రపంచంలోనే మొట్టమొదటి (Mission Drishti) ‘ఆప్టో-సార్’ సాంకేతికత
‘దృష్టి’ ఉపగ్రహం ప్రపంచంలోనే ఆప్టో-సార్ (OptoSAR imaging satellite) సాంకేతికత కలిగిన మొట్టమొదటి ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది. ఈ వినూత్న సాంకేతికత కారణంగా ఇది ఎలక్ట్రో ఆప్టికల్ (EO) , సింథటిక్ ఎపెర్చర్ రాడార్ (SAR) సెన్సర్లను సమర్థవంతంగా అనుసంధానించి పరిశీలనలు సాగిస్తుంది. సాధారణ ఉపగ్రహాలు మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు లేదా వాతావరణం (Mission Drishti) అనుకూలించని సమయంలో స్పష్టమైన చిత్రాలను తీయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కానీ, ఈ ఆప్టో-సార్ టెక్నాలజీతో పనిచేసే దృష్టి ఉపగ్రహం, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా భూమిని నిరంతరం పర్యవేక్షించే అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 1.5 మీటర్ల అత్యున్నత రిజల్యూషన్‌తో అత్యంత స్పష్టమైన చిత్రాలను భూమికి పంపగలదు.

దేశీయ ప్రైవేటు రంగంలో (Mission Drishti) అతిపెద్ద శాటిలైట్
భారతదేశంలోని ఒక ప్రైవేటు సంస్థ నిర్మించిన ఉపగ్రహాలలో ‘దృష్టి’ అతిపెద్దది కావటం విశేషం. సుమారు 190 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. అంతరిక్ష రంగంలో భారతీయ స్టార్టప్‌లు కేవలం చిన్న ఉపగ్రహాలకే పరిమితం కాకుండా, పెద్ద , సంక్లిష్టమైన ప్రాజెక్టులను కూడా విజయవంతంగా చేపట్టగలవని ఈ ప్రయోగం నిరూపించింది. అధునాతన సెన్సర్లు , ఇమేజింగ్ సామర్థ్యాలతో కూడిన ఈ శాటిలైట్, భూ పరిశీలన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ సమాచార సేకరణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది.
Read Also : OPEC Plus : పెరగనున్న చమురు ఉత్పత్తి.. కానీ ఆచరణలో అడ్డంకులు.!
ప్రధాని మోదీ ప్రశంసలు , హర్షం
గెలాక్స్‌ఐ సంస్థ చేపట్టిన ఈ ‘మిషన్ దృష్టి’ విజయవంతం కావడం పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇదొక కీలక విజయంగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు. దేశ పురోగతి , సరికొత్త ఆవిష్కరణల పట్ల నేటి భారతీయ యువతకు ఉన్న అభిరుచికి , అంకితభావానికి ఈ ప్రయోగం ఒక నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, ఒక భారతీయ అంకుర సంస్థ ప్రపంచస్థాయి సాంకేతికతతో ఇటువంటి విజయాన్ని సాధించడం గర్వకారణమని తెలుపుతూ, గెలాక్స్‌ఐ బృందానికి ప్రధాని తన శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also : West Bengal Election Results: బెంగాల్ ఎన్నికల ఫలితాలు.. 11 జిల్లాల్లో హై అలర్ట్..!














