Babar Azam : పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఫ్యూచర్ టీమ్‌ను బిల్డ్ చేసే ప్రాసెస్‌లో భాగంగా ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో యంగ్ టాలెంట్‌కు పెద్దపీట వేస్తూ టీమ్‌లోకి ఇద్దరు ప్రామిసింగ్ ప్లేయర్స్ ని తీసుకువచ్చింది. పాకిస్థాన్ రన్ మెషీన్ బాబర్ అజామ్ ఇంజూరీ కారణంగా టీమ్‌కు దూరం కావడంతో, సెలెక్టర్లు ఈ ఛాన్స్‌ను కొత్త వారికి ఇచ్చారు. ఇది పాక్ క్రికెట్లో ఒక కొత్త బిగినింగ్‌కు సంకేతంగా కనిపిస్తోంది.
మీర్పూర్ టెస్టుతో అదిరిపోయే (Babar Azam) ఆరంభం
బంగ్లాదేశ్ , పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ మే 8న ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. (Babar Azam) ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అందరి దృష్టి టీమ్ సెలెక్షన్ మీదే ఉంది. మోకాలి గాయం (Knee Injury) వల్ల బాబర్ అజామ్ ఈ మ్యాచ్ ఆడలేకపోవడంతో, అబ్దుల్లా ఫజల్ , అజాన్ అవైస్లు టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు.

అబ్దుల్లా ఫజల్.. కరాచీ లెఫ్ట్ (Babar Azam) హ్యాండ్ సెన్సేషన్
ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్యాప్ అందుకున్న 23 ఏళ్ల అబ్దుల్లా ఫజల్ కరాచీకి చెందిన టాలెంటెడ్ ఓపెనర్. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇప్పటివరకు ఆడిన 25 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 41.54 యావరేజ్‌తో 1,828 పరుగులు చేశాడు. (Babar Azam) ఇందులో 4 సెంచరీలు ఉండగా, ఒక ఇన్నింగ్స్‌లో ఏకంగా 182 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రీజులో ఎక్కువ సేపు నిలబడి ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేయడంలో ఇతను ఎక్స్పర్ట్ అని పేరుంది.
Read Also : Amazon Summer Sale : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా .. కేవలం రూ. 5,499 కే అదిరిపోయే స్మార్ట్ టీవీలు.!
అజాన్ అవైస్.. ఫ్యూచర్ (Babar Azam) సూపర్ స్టార్
మరో యంగ్ ప్లేయర్ అజాన్ అవైస్ మీద పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌కు భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. 21 ఏళ్ల ఈ సియాల్కోట్ కుర్రాడు డొమెస్టిక్ సర్క్యూట్లో ఇప్పటికే ఒక రేంజ్ లో స్కోర్లు చేస్తున్నాడు. కేవలం 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలోనే 2,673 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇతని బ్యాటింగ్ యావరేజ్ 48.60 కాగా, కెరీర్ బెస్ట్ స్కోరు 203 నాటౌట్. టెక్నిక్ పరంగా ఇతను బాబర్ అజామ్ కి రీప్లేస్మెంట్ కాగలడని చాలా మంది నమ్ముతున్నారు.
యూత్ , ఎక్స్పీరియెన్స్ల బ్యాలెన్సింగ్
పాకిస్థాన్ టీమ్ ఈ మ్యాచ్ కోసం యంగ్ ప్లేయర్స్‌తో పాటు ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సీనియర్లను కూడా తీసుకుంది. బ్యాటింగ్ లో ఇమామ్-ఉల్-హక్, సౌద్ షకీల్ , మహ్మద్ రిజ్వాన్ లాంటి వారు ఉండగా, బౌలింగ్ యూనిట్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత మహ్మద్ అబ్బాస్‌కు మళ్ళీ ఛాన్స్ దక్కింది. అతనికి తోడుగా షాహీన్ అఫ్రిది , హసన్ అలీ ఫాస్ట్ బౌలింగ్ భారాన్ని మోస్తుండగా, స్పిన్ డిపార్ట్మెంట్ను నోమాన్ అలీ హ్యాండిల్ చేస్తున్నాడు.
బంగ్లాదేశ్ కౌంటర్ అటాక్
ఇక హోమ్ టీమ్ బంగ్లాదేశ్ కూడా పక్కా ప్లాన్ తో బరిలోకి దిగింది. ఆ టీమ్ స్టార్ బౌలర్ టాస్కిన్ అహ్మద్ గాయం నుండి కోలుకుని చాలా కాలం తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో నేతృత్వంలో ముష్ఫికర్ రహీమ్ , లిటన్ దాస్ లాంటి సీనియర్లతో బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇవ్వడానికి రెడీగా ఉంది. మొత్తం మీద ఈ టెస్ట్ మ్యాచ్ ఇరు దేశాల మధ్య ఉన్న పాత రైవల్రీని మళ్ళీ గుర్తు చేస్తోంది.













