తాజా వార్తలు

Dacoit Review: డెకాయిట్ రివ్యూ: స్టార్ట్ బాగుంది.. కానీ ఫుల్ కిక్?

Adivi Sesh Dacoit movie review Telugu film Mrunal Thakur

Dacoit Review: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కథలు సాధారణంగా రా, రియల్‌గా ఉంటాయి. “డెకాయిట్” కూడా అలాంటి కథతోనే మొదలవుతుంది. హిందూపురానికి చెందిన హరిదాస్ అనే యువకుడు, సామాజికంగా తక్కువ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. అదే సమయంలో ఉన్నత వర్గానికి చెందిన సరస్వతిని ప్రేమిస్తాడు. ఈ ప్రేమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అనూహ్యంగా జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ విభేదం అక్కడితో ఆగదు. హరి జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. జైలులో గడిచే రోజులు అతనిలో ప్రేమను కాదు.. పగను పెంచుతాయి. బయటికి వచ్చిన తర్వాత అతని లక్ష్యం ఒక్కటే.. సరస్వతిపై ప్రతీకారం.

ఇక్కడి నుంచి కథ ఒక థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్తుంది. జైలు నుంచి తప్పించుకునే సన్నివేశాలు, పోలీసులను తప్పించుకుంటూ తిరిగే ఎపిసోడ్‌లు సినిమాకు మంచి వేగం తీసుకువస్తాయి. మొదటి భాగం చూస్తే, ఇది ఒక సాలిడ్ రివేంజ్ డ్రామాగా మారుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ, ఆ ఆసక్తి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా “ఇద్దరి మధ్య నిజంగా ఏమైంది?” అన్న పాయింట్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేయడంలో సినిమా కొంత వెనుకబడింది. అదే మొత్తం కథపై ప్రభావం చూపింది.

Also Read: https://www.telugunews.co/spirit-movie-set-fire-accident-prabhas-update/

“డెకాయిట్”లో ప్రధానంగా కనిపించే లోపం ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం. హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ ఎంత బలంగా ఉందో ప్రేక్షకుడికి పూర్తిగా అనిపించదని పలువురు తమ అభిప్రాయం వెలిబుచ్చారు. వారి మధ్య జరిగిన విభేదం కూడా అంతగా నమ్మించేలా చూపించలేకపోయారు. దీంతో హీరోకి సరస్వతిపై ఉన్న కోపం, అతని రివేంజ్ మైండ్‌సెట్ ప్రేక్షకుడికి అంతగా కనెక్ట్ అవ్వదని మరికొందరు తమ కామెంట్స్ చెప్పేశారు. ఒక థ్రిల్లర్ లేదా రివేంజ్ డ్రామాలో ఇది చాలా కీలకం. అదే బలహీనంగా ఉంటే కథ ఎంత ప్లాన్ చేసినా ప్రభావం తగ్గిపోతుంది. కొన్ని ట్విస్టులు కూడా సహజంగా కాకుండా, కథ కోసం బలవంతంగా పెట్టినట్టుగా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో ఉండాల్సిన పకడ్బందీ, లాజికల్ ఫ్లో ఈసారి కొంచెం మిస్ అయినట్టు కనిపిస్తుంది.

నటన, టెక్నికల్‌గా బాగానే..!
అడివి శేష్ తన పాత్రలో ఎప్పటిలాగే కట్టిపడేస్తాడు. స్క్రీన్‌పై అతని ప్రెజెన్స్, ఇంటెన్సిటీ బాగానే ఉన్నాయి. అయితే రాయలసీమ యాస మాత్రం పూర్తిగా సహజంగా అనిపించదు. కొన్ని చోట్ల అది స్పష్టంగా కనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ మాత్రం సినిమా మొత్తంలో ఎమోషనల్ యాంకర్‌లా నిలుస్తుంది. ముఖ్యంగా ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో నటన హైలైట్‌గా అనిపిస్తుంది. ఆమె ఉన్న చోటే సినిమా కాస్త బలంగా నిలబడుతుంది.

టెక్నికల్ విషయాల్లో సినిమా బాగానే ఉంది. విజువల్స్ క్లీన్గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కానీ శేష్ సినిమాలకు సాధారణంగా ఉండే టైట్ స్క్రీన్‌ప్లే, స్మార్ట్ ట్విస్టులు ఈసారి అంతగా కనిపించలేదు. “డెకాయిట్”ను ఒక సింపుల్ థ్రిల్లర్‌గా చూస్తే ఓకే అనిపిస్తుంది. కానీ అడివి శేష్ నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ స్థాయిలో మాత్రం ఈ సినిమా పూర్తి సంతృప్తి ఇవ్వలేకపోయింది. మొత్తానికి, కథలో ఐడియా బాగున్నా.. ఎమోషన్, స్క్రీన్‌ప్లే బలంగా ఉంటే ఈ సినిమా ఇంకో లెవెల్‌కు వెళ్లేది. మొత్తం మీద ఫ్యాన్స్ మాత్రం సినిమా సూపర్ అంటూ కొందరు, మరికొందరు కాస్త ఫర్వాలేదని అంటున్నారు. ఏదిఏమైనా ఒక సినిమా వెనుక ఎందరో శ్రమ దాగి ఉంటుంది కాబట్టి సినిమాను వినోదంగా చూసి ఆదరించాలని మరికొందరు చెబుతున్న పరిస్థితి.

రేటింగ్: 3.15/5

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.