తాజా వార్తలు

CM Chandrababu : ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ‘డెడ్ లైన్’.!

cm-chandrababu

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై తనదైన ముద్ర వేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం స్వీకరించడమే కాకుండా, వాటిని నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త విధానాలను ప్రకటించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడే వాస్తవ సమస్యలు తెలుస్తాయని, ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

నియోజకవర్గ స్థాయిలో ‘ఫీల్డ్ గ్రీవెన్స్ డే’ (CM Chandrababu) అమలు

గ్రీవెన్స్ డే (ప్రజావాణి) వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సీఎం చంద్రబాబు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో మాత్రమే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అయితే, ఇకపై ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా గ్రీవెన్స్ డే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ‘ఫీల్డ్ గ్రీవెన్స్ డే’ నిర్వహించాలని (CM Chandrababu) స్పష్టం చేశారు. దీనివల్ల సామాన్యులు తమ సమస్యల కోసం జిల్లా కేంద్రాల వరకు ప్రయాణించే భారం తగ్గుతుందని, స్థానికంగానే సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.

cm-chandrababu-1

పీజీఆర్ఎస్ (PGRS) బలోపేతం.. సింగపూర్ మోడల్ దిశగా!

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను (Public Grievance Redressal System) మరింత ఎఫెక్టివ్‌గా మార్చేందుకు సీఎం అంతర్జాతీయ ప్రమాణాలను ప్రస్తావించారు. సింగపూర్‌లో అమలవుతున్న ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని ఉదాహరణగా చూపుతూ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే తరహాలో వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్ విధానంలో ప్రజాప్రతినిధులు, (CM Chandrababu) అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ప్రజాదర్బార్ తరహాలో ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మండల స్థాయిలో కూడా సమస్యలు పరిష్కారం కావడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Read Also : Suryakumar Yadav : శుభవార్త చెప్పిన SKY.. సూర్యకుమార్ యాదవ్ ఇంట్లో ‘లిటిల్ ప్రిన్సెస్’ రాక..

కలెక్టర్లకు పవర్ ఫుల్ మెసేజ్.. “అర్జీలు కార్లో పెట్టుకోవద్దు”

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా స్పందించారు. ప్రజలు ఎన్నో ఆశలతో ఇచ్చే అర్జీలను కేవలం స్వీకరించి ఆఫీసు ఫైళ్లకో లేదా కార్లకో పరిమితం చేయవద్దని గట్టిగా హెచ్చరించారు. “అర్జీలు తీసుకుని కార్లో పెట్టుకోవద్దు, సమస్యలకు నిజంగా పరిష్కారం చూపాలి” అని అధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రతి కలెక్టర్ నెలకు కనీసం నాలుగు సార్లు ఏదో ఒక నియోజకవర్గాన్ని సందర్శించాలని, ఒక ‘గుడ్‌విల్ మిషన్’ లాగా క్షేత్రస్థాయికి వెళ్లి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్సుల భారం తగ్గింపు , క్షేత్రస్థాయి పర్యటనలు

అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఉండాలన్నదే సీఎం ప్రధాన ఉద్దేశం. నిత్యం వీడియో కాన్ఫరెన్సులతో అధికారుల సమయం వృధా అవుతోందని గుర్తించిన చంద్రబాబు, ఇకపై అన్ని రకాల రివ్యూ మీటింగ్‌లను , వీడియో కాన్ఫరెన్సులను వారానికి ఒక్క రోజుకే పరిమితం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల అధికారులకు క్షేత్రస్థాయి పర్యటనలకు , ప్రజా సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు. అధికారుల పనితీరును బట్టే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.