తాజా వార్తలు

PM Modi : దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని మోదీ ‘ఏడు సూత్రాల’ పొదుపు మంత్రం.!

PM-MOdi

PM Modi : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల ఆర్థిక ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చివేసింది. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం ఇప్పటివరకు దేశీయంగా ఇంధన ధరలు పెరగకుండా నియంత్రిస్తూ సామాన్యులపై భారం పడకుండా చూసింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మరింత జటిలమవడంతో దేశ ఆర్థిక సుస్థిరతను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. వడోదరలో సోమవారం జరిగిన సర్థార్ ధామ్ భవన్-3 ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, 24 గంటల వ్యవధిలోనే రెండోసారి దేశ ప్రజలకు అత్యవసర విజ్ఞప్తి చేశారు.

ఆయిల్ సంస్థల భారీ నష్టాలు.. (PM Modi) పొదుపే ఏకైక మార్గం

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం , హార్ముజ్ జలసంధి మూతపడటం వంటి పరిణామాలు భారత ఆయిల్ మార్కెటింగ్ సంస్థలపై (IOC, BPCL, HPCL) తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకపోవడంతో, ఈ సంస్థలు రోజుకు సుమారు రూ. 1,000 కోట్ల మేర నష్టపోతున్నాయని (PM Modi) గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల మేర అండర్ రికవరీ భారాన్ని మోస్తున్న ఆయిల్ సంస్థలను గట్టెక్కించడానికి , దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ఇంధన వాడకాన్ని తగ్గించుకోవడమే ఏకైక మార్గమని ప్రధాని స్పష్టం చేశారు.

PM-MOdi-1

కరోనా తరహాలోనే.. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’, (PM Modi) ‘ఆన్‌లైన్ విద్య’

దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడానికి ప్రధాని మోదీ ‘ఏడు సూత్రాల’ పొదుపు మంత్రాన్ని ప్రజల ముందుంచారు. కరోనా కష్టకాలంలో మనం అనుసరించిన పద్ధతులను మళ్లీ పాటించాలని ఆయన కోరారు. ఐటీ , కార్పొరేట్ సంస్థలు వీలైనంత వరకు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) సౌకర్యం కల్పించాలని, వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తద్వారా రోడ్లపై వాహనాల రద్దీ తగ్గి, భారీగా ఇంధనం ఆదా అవుతుందన్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించడం ద్వారా రవాణా ఖర్చులను, ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చని సూచించారు. అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయవద్దని, దేశీయ పర్యాటకానికే ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Read Also : Rajinikanth – Kamal Haasan : రజనీ-కమల్ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ షేక్ చేసే క్రేజీ కాంబోలోకి త్రిష ఎంట్రీ.?

బంగారం, వంట నూనె వినియోగంపై నియంత్రణ

ముడి చమురు తర్వాత భారత్ అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని బంగారం , వంట నూనెల దిగుమతికే ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రజలకు కీలక సూచనలు చేస్తూ, విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని 24 గంటల్లో రెండోసారి విజ్ఞప్తి చేశారు. మన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని, వంట నూనె వినియోగాన్ని మితంగా ఉంచాలని కోరారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని పేర్కొన్నారు. రసాయన ఎరువుల దిగుమతి భారాన్ని తగ్గించేందుకు రైతులు 50 శాతం మేర ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.

సర్థార్ గౌరవ్ రత్న పురస్కారం

ఈ పర్యటనలో భాగంగా పాటిదార్ సమాజం నిర్మించిన సర్థార్ ధామ్ వసతి గృహాన్ని ప్రధాని ప్రారంభించారు. దేశ నిర్మాణం , సామాజిక అభివృద్ధిలో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఎనిమిది ప్రధాన పాటిదార్ సంస్థలు కలిసి మోదీకి ‘సర్థార్ గౌరవ్ రత్న’ పురస్కారాన్ని ప్రదానం చేశాయి. “మనం దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోకపోతే దేశం ఎలా పురోగమిస్తుంది?” అని ప్రశ్నించిన ప్రధాని, ప్రతి భారతీయుడు బాధ్యతగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే దేశాన్ని ఈ మహా సంక్షోభం నుంచి కాపాడుకోవచ్చని ఆకాంక్షించారు.

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.