Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక భారీ మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రానికి మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరు ఖరారైంది. శుక్రవారం కోల్‌కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల మీటింగ్‌లో ఈ డెసిషన్ తీసుకున్నారు. బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ సమీక్ భట్టాచార్య, సువేందు పేరును ప్రపోజ్ చేయగా, ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆయన్ని తమ లీడర్‌గా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయంతో బెంగాల్లో సుదీర్ఘ కాలం సాగిన ప్రాంతీయ పార్టీల పాలనకు చెక్ పడినట్లయింది.
గ్రాండ్‌గా ప్రమాణస్వీకార (Suvendu Adhikari ) కార్యక్రమం
ఈ చారిత్రాత్మక కార్యక్రమం శనివారం, మే 09న ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని ప్రఖ్యాత బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరగనుంది. ఈ ఈవెంట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ చీఫ్ గెస్ట్‌గా హాజరుకాబోతున్నారు. వారితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు , డిప్యూటీ సీఎంలు కూడా (Suvendu Adhikari ) ఈ ఫంక్షన్‌కు రానున్నారు. సువేందు అధికారితో పాటు మరో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. బెంగాల్లో ఫస్ట్ టైమ్ పవర్ లోకి వచ్చిన బీజేపీ, ఈ అకేషన్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

మమతా బెనర్జీపై ‘జెయింట్ కిల్లర్’ విజయం
సువేందు అధికారి ఈ స్థాయికి చేరడానికి ఆయన సాధించిన అద్భుతమైన విజయాలే కారణం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు ఏకంగా అప్పటి సీఎం మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గం అయిన భవానీపూర్‌లో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. (Suvendu Adhikari ) అంతకుముందు 2021లో కూడా నందిగ్రామ్‌లో ఆమెపై గెలిచి తన పవర్ ఏంటో చూపించారు. వరుసగా రెండుసార్లు ‘దీదీ’ని ఓడించిన నేతగా సువేందు ఒక రికార్డు క్రియేట్ చేశారు. బెంగాల్లో బీజేపీ వేవ్ తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
Read Also : CM Chandrababu : ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ‘డెడ్ లైన్’.!
ఎన్నికల ఫలితాల్లో బీజేపీ క్లీన్ స్వీప్
ఈసారి జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ అందరినీ షాక్‌కు గురిచేశాయి. మొత్తం 294 సీట్లకు గానూ బీజేపీ ఏకంగా 207 స్థానాల్లో ఘనవిజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. గత 50 ఏళ్లలో ఒక జాతీయ పార్టీ బెంగాల్లో ఈ స్థాయిలో మెజారిటీ సాధించడం ఇదే మొదటిసారి. మరోవైపు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) కేవలం 80 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ భారీ మెజారిటీతో బెంగాల్లో బీజేపీ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
కొత్త పాలనపై భారీ అంచనాలు
మొదటిసారి బెంగాల్ పగ్గాలు చేపడుతున్న బీజేపీపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్‌ను డెవలప్మెంట్ బాటలో నడిపిస్తారని కమలం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రేపు జరగబోయే ఈ ప్రమాణస్వీకారంతో బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది.














