తాజా వార్తలు

Nida Khan Arrest : టీసీఎస్ మతమార్పిడి కేసులో బిగ్ బ్రేక్.. 25 రోజుల నుంచి పరారలో ఉన్న నిదా ఖాన్‌ అరెస్ట్..!

Nida-Khan-Arrest

Nida Khan Arrest : దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పెను సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గత కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌ను మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఐటీ దిగ్గజ సంస్థలో పని చేస్తూనే, తోటి ఉద్యోగులను మత మార్పిడికి ప్రేరేపించడం, మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడటం వంటి సీరియస్ ఆరోపణలు రావడంతో ఈ కేసు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏడుగురు అరెస్ట్ కాగా, నిదా ఖాన్ అరెస్ట్‌తో మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

సినిమా ఫక్కీలో పోలీసుల సీక్రెట్ (Nida Khan Arrest) ఆపరేషన్

నిదా ఖాన్ ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు అత్యంత గోప్యంగా ఒక భారీ ఆపరేషన్‌ను ప్లాన్ చేశారు. ఛత్రపతి శంభాజీనగర్‌లోని నరేగావ్ ప్రాంతంలో ఆమె తలదాచుకుందనే పక్కా ఇన్ఫర్మేషన్‌తో పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులు యూనిఫాం (Nida Khan Arrest) ధరించకుండా, పోలీస్ జీపులను వాడకుండా సాధారణ వ్యక్తుల్లా ఆ ప్రాంతంలో మూడు నాలుగు రోజులు నిఘా పెట్టారు. టెక్నికల్ అనాలిసిస్ , లొకేషన్ ట్రాకింగ్ సాయంతో ఆమె కైజర్ కాలనీలోని ఒక అద్దె ఇంట్లో తన ఫ్యామిలీతో కలిసి ఉన్నట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. స్థానిక పోలీసులకు కూడా లీక్ అవ్వకుండా దాదాపు 20 మంది సిబ్బంది ఆ ఇంటిని చుట్టుముట్టి, అత్యంత చాకచక్యంగా నిదా ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Nida-Khan-Arrest-1

బెయిల్ ప్రయత్నాలు (Nida Khan Arrest) విఫలం

నిదా ఖాన్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు లీగల్ గా చాలా ప్రయత్నాలు చేసింది. తాను ప్రెగ్నెంట్ అని చెబుతూ గతంలో ఇంటర్మీడియట్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినప్పటికీ, ధర్మాసనం ఆమె రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసింది. పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉంటూనే, మరికొంతమంది లాయర్ల ద్వారా మళ్ళీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేయడానికి ఆమె ప్లాన్ చేస్తోంది. అయితే ఆమె కోర్టును ఆశ్రయించే లోపే పోలీసులు పక్కా స్కెచ్ తో ఆమెను అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టి ట్రాన్సిట్ రిమాండ్ పొందిన పోలీసులు, తదుపరి విచారణ కోసం ఆమెను నాసిక్ తరలించారు.

Read Also : Suvendu Adhikari : బెంగాల్ హిస్టరీలో కొత్త చాప్టర్.. మే 9న సీఎంగా సువేందు అధికారి.!

టీసీఎస్ ఉద్యోగిగా మతమార్పిడి నెట్‌వర్క్

2021 నుండి టీసీఎస్‌లో ‘ప్రాసెస్ అసోసియేట్’గా పనిచేస్తున్న నిదా ఖాన్, తన పొజిషన్ ను అడ్డం పెట్టుకుని సహోద్యోగులపై మతపరమైన ఒత్తిడి తెచ్చినట్లు విచారణలో తేలింది. హిందూ ఉద్యోగులను టార్గెట్ చేయడం, వారికి ఇస్లామిక్ సాహిత్యం, వీడియోలు , వివాదాస్పద కంటెంట్‌ను పంపడం ద్వారా వారిని మత మార్పిడి వైపు మళ్లించేందుకు ప్రయత్నించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా గత నెలలోనే టీసీఎస్ మేనేజ్మెంట్ ఆమెను సస్పెండ్ చేసింది. కేవలం మతమార్పిడి మాత్రమే కాకుండా, ఈ కేసులో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

నాసిక్ టీసీఎస్ కేసులో నిదా ఖాన్ అరెస్ట్ ఒక మేజర్ డెవలప్‌మెంట్. ఐటీ లాంటి కార్పొరేట్ ఆఫీసుల్లో ఇలాంటి కార్యకలాపాలు జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిదా ఖాన్ విచారణలో ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వీరికి ఎక్కడి నుండి సపోర్ట్ అందుతోంది? అనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ అరెస్ట్‌తో బాధితులకు న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు.

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.