Angkrish Raghuvanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) , కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన మ్యాచ్ అనేక మలుపులకు వేదికైంది. ఒకవైపు మైదానంలో పరుగుల వరద పారితే, మరోవైపు ఆటగాళ్ల ప్రవర్తన చర్చనీయాంశమైంది. కేకేఆర్ యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ మైదానంలో అసహనం వ్యక్తం చేసినందుకు ఐపీఎల్ నిర్వాహకులు అతనికి భారీ జరిమానా విధించారు. లీగ్ నిబంధనలను అతిక్రమించినందుకు గానూ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ కమిటీ స్పష్టం చేసింది.
ఏం జరిగింది.? రఘువంశీ (Angkrish Raghuvanshi) ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు?
లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వద్ద హై డ్రామా చోటుచేసుకుంది. అంగ్‌క్రిష్ రఘువంశీ అనూహ్య రీతిలో ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ (ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించడం) కింద ఔటయ్యాడు. థర్డ్ అంపైర్ ఇచ్చిన ఈ నిర్ణయంపై రఘువంశీ తీవ్ర (Angkrish Raghuvanshi) అసంతృప్తి వ్యక్తం చేశాడు. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో తన కోపాన్ని ఆపుకోలేక బౌండరీ లైన్ వద్ద ఉన్న కుషన్‌ను బ్యాట్‌తో బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా డగౌట్‌లోకి వెళ్ళిన తర్వాత తన హెల్మెట్‌ను నేలకేసి విసిరేశాడు. ఈ దృశ్యాలు కెమెరాలో నిక్షిప్తమవ్వడంతో ఐపీఎల్ మ్యాచ్ రిఫరీ దీనిని తీవ్రంగా పరిగణించారు.

భారీ జరిమానా , (Angkrish Raghuvanshi) డీమెరిట్ పాయింట్లు
రఘువంశీ ప్రవర్తన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 తప్పిదమని తేల్చారు. మైదానంలోని వస్తువులను లేదా క్రీడా పరికరాలను దుర్వినియోగం చేసినందుకు గానూ అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. దీనికి తోడు అతని రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు. రఘువంశీ తన పొరపాటును అంగీకరించడంతో విచారణ అవసరం లేకుండానే శిక్షను ఖరారు చేశారు. యువ ఆటగాళ్లు ఇలాంటి భావోద్వేగాలను నియంత్రించుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
Read Also : IPL Stars : ఢిల్లీ గల్లీల్లో ఐపీఎల్ స్టార్ల రచ్చ.. ప్లాస్టిక్ బంతితో సిక్సర్ల వర్షం..?
సూపర్ ఓవర్ థ్రిల్లర్.. (Angkrish Raghuvanshi) ఆఖరి బంతికి షమీ సిక్సర్!
ఈ వివాదం పక్కన పెడితే, మ్యాచ్ మాత్రం క్రికెట్ ప్రేమికులకు పైసా వసూల్ వినోదాన్ని అందించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి భారీ పరుగులు అవసరం కాగా, క్రీజులో ఉన్న మహ్మద్ షమీ అనూహ్యంగా బ్యాట్‌తో చెలరేగిపోయాడు. చివరి బంతికి 7 పరుగులు కావాల్సిన దశలో షమీ సిక్సర్ బాదడంతో మ్యాచ్ టై అయింది. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది.
కేకేఆర్ గెలుపు.. నరాలు తెగే ఉత్కంఠ
ఫలితం కోసం నిర్వహించిన సూపర్ ఓవర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పైచేయి సాధించింది. సూపర్ ఓవర్‌లో కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. అయితే, విజయం సాధించిన ఆనందంలో ఉన్న కేకేఆర్ క్యాంప్‌లో రఘువంశీపై పడిన జరిమానా కొంత నిరాశను మిగిల్చింది. ఏది ఏమైనా, ఈ మ్యాచ్ ఐపీఎల్ 2026లోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
Read Also : AP Fuel Crisis : ఏపీలో పెట్రోల్ టెన్షన్.. 421 బంకులు మూత.. !














