Varanasi : బాహుబలి, RRR సినిమాలతో ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాజమౌళి, ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ కోసం అంతకు మించిన ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం రాజమౌళి ఒక వినూత్నమైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన సబ్ స్క్రిప్షన్ ట్రెండును రాజమౌళి ఇప్పుడు తన సినిమా ప్రమోషన్ల కోసం అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏదైనా సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోలు, షూటింగ్ విశేషాలు లేదా నటీనటుల ఇంటర్వ్యూలు సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వాడుకుంటారు కాబట్టి అవన్నీ ఉచితంగానే దొరుకుతాయి, కానీ ‘వారణాసి’ విషయంలో రాజమౌళి పూర్తిగా రూటు మార్చారు.
రూ. 199 ప్యాకేజీతో ఎక్స్‌క్లూజివ్ (Varanasi) కంటెంట్
ఈ సినిమా వెనుక ఉన్న కష్టాన్ని, తెర వెనుక జరిగే ఆసక్తికరమైన బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోలను వీక్షించాలనుకునే అభిమానుల కోసం రూ. 199 ధరతో ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ప్యాకేజీలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలకు సంబంధించిన (Varanasi) ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, సినిమా కోసం వారు పడుతున్న శ్రమను వివరించే ప్రత్యేక వీడియోలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ కాస్ట్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలు , ప్రేక్షకులకు మరెక్కడా లభించని కొన్ని ఆసక్తికరమైన ‘టెడ్ బిట్స్’ వంటి వాటిని కూడా ఈ ప్యాకేజీలో ఉంచబోతున్నారు.

సినిమా ప్రమోషన్లలో సరికొత్త (Varanasi) ప్రయోగం
సినిమా టికెట్ ధరలకే జనం బెంబేలెత్తిపోతున్న ఈ రోజుల్లో, కేవలం ప్రమోషనల్ కంటెంట్ కోసం డబ్బులు అడగడం అనేది అత్యంత సాహసోపేతమైన నిర్ణయమే. అయితే, రాజమౌళి సినిమాలపై ఉండే క్రేజ్ సామాన్యమైనది కాదు కాబట్టి, ఆ ప్రాజెక్ట్ మేకింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో బలంగా ఉంది. ఒకవేళ ఈ స్ట్రాటజీ గనుక క్లిక్ అయితే, భవిష్యత్తులో ఇతర పెద్ద దర్శకులు, స్టార్ హీరోలు కూడా తమ సినిమాల ప్రమోషన్ల కోసం ఇదే బాట పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల
ఇప్పటికే భారీ బడ్జెట్‌తో, గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. రాజమౌళి తీసుకున్న ఈ పేయిడ్ ప్రమోషన్ నిర్ణయం చిత్ర పరిశ్రమలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














