తాజా వార్తలు

Jeffrey Epstein : ఎప్‌స్టీన్ మరణం వెనుక మరో మిస్టరీ.. ఏడేళ్లుగా దాచిన ఆ సూసైడ్ నోట్‌లో ఏముంది.?

Jeffrey-Epstein

Jeffrey Epstein : అమెరికన్ ఫైనాన్షియర్, ప్రపంచవ్యాప్త లైంగిక వేధింపుల రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణంపై మళ్ళీ చర్చ మొదలైంది. 2019లో జైలు గదిలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఈ సంచలన నేరగాడికి సంబంధించి ఇప్పటివరకు బయటపడని ఒక రహస్య లేఖ (సూసైడ్ నోట్) ఉందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ తాజాగా వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ లేఖను గత ఏడేళ్లుగా అత్యంత రహస్యంగా సీల్ చేసి ఉంచారు.

మొదటి ఆత్మహత్యాయత్నం.. పసుపు (Jeffrey Epstein) రంగు కాగితంపై లేఖ

న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఎప్‌స్టీన్ 2019 ఆగస్టులో చనిపోవడానికి ఒక నెల ముందే, అంటే జూలైలో మొదటిసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తన జైలు గదిలో మెడకు గుడ్డ బిగుసుకుని అపస్మారక స్థితిలో పడి ఉండగా అధికారులు గుర్తించారు. (Jeffrey Epstein) అయితే, ఆ సమయంలో అతనితో పాటు అదే సెల్‌లో ఉన్న మాజీ పోలీస్ అధికారి నికోలస్ టార్టాగ్లియోన్ ఒక గ్రాఫిక్ నవలలో దాచి ఉంచిన పసుపు రంగు పేపర్‌ను కనుగొన్నాడు. అందులో ఎప్‌స్టీన్ స్వయంగా రాసినట్లుగా భావిస్తున్న సంతకం లేని లేఖ ఉంది.

Jeffrey-Epstein-1

‘గుడ్ బై చెప్పే సమయం (Jeffrey Epstein) వచ్చింది’

ఆ లేఖలో “గుడ్ బై చెప్పే సమయం వచ్చింది” (Time to say goodbye) అనే కీలకమైన వాక్యం ఉన్నట్లు సమాచారం. అయితే, తన సెల్‌మేట్ ఎప్‌స్టీన్ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆ లేఖను జైలు అధికారులకు ఇవ్వకుండా తన న్యాయవాదులకు అప్పగించాడు. ఎప్‌స్టీన్ తనపై (Jeffrey Epstein) దాడి చేశాడని తప్పుడు ఆరోపణలు చేస్తాడన్న భయంతోనే ఆ నోట్‌ను భద్రపరిచినట్లు టార్టాగ్లియోన్ పేర్కొన్నాడు. విచిత్రమేమిటంటే, ఆ సమయంలో ఎప్‌స్టీన్ సైతం టార్టాగ్లియోన్ తనను చంపడానికి ప్రయత్నించాడని అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Read Also : Kalki 2898 AD : కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ షురూ.. సరికొత్త లుక్‌లో ప్రభాస్..!

ఏడేళ్లుగా ఎందుకు రహస్యంగా ఉంచారు?

ఈ లేఖను అప్పట్లో టార్టాగ్లియో కేసును విచారిస్తున్న ఫెడరల్ జడ్జి సీల్ చేయాలని ఆదేశించారు. దీనివల్ల అమెరికా న్యాయశాఖ గానీ, ఇతర దర్యాప్తు సంస్థలు గానీ ఇప్పటివరకు ఆ లేఖను పరిశీలించలేదు. అసలు అది నిజంగా ఎప్‌స్టీన్ రాసిందేనా? లేక కావాలని సృష్టించారా? అన్నది నేటికీ మిస్టరీగానే ఉంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, శక్తివంతులతో ఎప్‌స్టీన్‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో, ఈ లేఖలో ఇంకేవైనా సంచలన విషయాలు ఉన్నాయా అనే కోణంలో ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఇప్పుడు ఆ సీల్ చేసిన లేఖను బహిరంగపరచాలని కోర్టును ఆశ్రయించింది.

Read Also : SBI : క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్.. నేటి నుంచే కొత్త నిబంధనలు అమలు..!

వీడని అనుమానాలు.. మానసిక స్థితిపై ఆరా

ఎప్‌స్టీన్ మరణాన్ని అధికారికంగా ఆత్మహత్యగా ప్రకటించినప్పటికీ, అతని మరణం వెనుక అనేక కుట్ర కోణాలు ఉన్నాయని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు. గొంతుపై ఉన్న ఎర్రటి గుర్తులు, తనపై దాడి జరిగిందన్న ఎప్‌స్టీన్ ఆరోపణలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఒకవేళ ఈ లేఖ బయటకు వస్తే, చనిపోవడానికి ముందు ఎప్‌స్టీన్ మానసిక స్థితి ఎలా ఉంది? అతను ఎవరికైనా భయపడ్డాడా? లేదా తన నేరాల చిట్టా బయటపడుతుందన్న ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడా? అన్న విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.