Gardening Tips : వేసవి కాలం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది మల్లెపూల పరిమళం. అయితే చాలా మంది తమ ఇంట్లో మల్లె మొక్కలు ఉన్నా, అవి సరిగ్గా పూయడం లేదని లేదా మొగ్గలు రావడం లేదని బాధపడుతుంటారు. నర్సరీ నుంచి తెచ్చినప్పుడు బాగానే పూసినా, ఆ తర్వాత పూలు తగ్గిపోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మల్లె మొక్కకు అద్భుతమైన పోషణ అందించి, గుత్తులు గుత్తులుగా పూలు పూయించవచ్చని మీకు తెలుసా?
మల్లె మొక్కకు కావాల్సిన (Gardening Tips) ‘మ్యాజిక్’ ఎరువు
మన వంటింట్లో పడేసే వస్తువులే మల్లె మొక్కకు గొప్ప బలాన్నిస్తాయి. ముఖ్యంగా ఉల్లిపాయ తొక్కలు , బియ్యం కడిగిన నీరు మల్లె మొక్కకు మేలు చేస్తాయి. (Gardening Tips) ఉల్లిపాయ తొక్కలలో పొటాషియం , ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి, ఇవి పూలు పూయడానికి ఎంతగానో తోడ్పడతాయి.
ఎలా తయారు చేయాలి: ఒక గుప్పెడు ఉల్లిపాయ తొక్కలను ఒక లీటర్ నీటిలో 24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి, మల్లె మొక్క మొదళ్లలో పోయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే మొక్కకు అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే, బియ్యం లేదా పప్పులు కడిగిన నీటిని పారబోయకుండా మొక్కలకు పోయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

ప్రూనింగ్ (కత్తిరింపు) చాలా ముఖ్యం
మల్లె మొక్క నిండా పూలు రావాలంటే సరైన సమయంలో కత్తిరించడం (Pruning) చాలా అవసరం. వేసవి ప్రారంభానికి ముందే ఎండిపోయిన కొమ్మలను, అనవసరమైన ఆకులను తొలగించాలి. దీనివల్ల మొక్కకు కొత్త చిగుర్లు వస్తాయి. సాధారణంగా మల్లెపూలు కొత్తగా వచ్చిన కొమ్మలకే పూస్తాయి. కాబట్టి, పాత కొమ్మలను కత్తిరించడం వల్ల మొక్క మరింత బుషీగా తయారవుతుంది , ఎక్కువ మొగ్గలు రావడానికి అవకాశం ఉంటుంది.
Read Also : AP Fuel Crisis : ఏపీలో పెట్రోల్ టెన్షన్.. 421 బంకులు మూత.. !
ఎండ , (Gardening Tips) నీటి సరఫరా
మల్లె మొక్కలు ఎండను బాగా ఇష్టపడతాయి. కనీసం రోజుకు 5 నుంచి 6 గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట ఈ మొక్కను ఉంచాలి. ఎండ తక్కువగా ఉంటే ఆకులు ఎక్కువగా పెరిగి, పూలు పూయడం తగ్గిపోతుంది. అలాగే, కుండీలో మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి కానీ, నీరు నిల్వ ఉండకూడదు. నీరు ఎక్కువగా పోస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
Read Also : H-City : హైదరాబాద్ రూపురేఖలు మార్చబోతున్న ‘H-City’ ప్రాజెక్ట్
మట్టిని లూజ్ చేయడం (Soil Aeration)
పదిహేను రోజులకు ఒకసారి ఒక చిన్న కర్ర లేదా ఖుర్పాతో కుండీలోని పై మట్టిని కొద్దిగా కిందకు మీదకు చేయాలి. ఇలా చేయడం వల్ల వేర్లకు గాలి (Oxygen) అందుతుంది. ఈ సమయంలోనే కొద్దిగా పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ కలిపితే మొక్క మరింత వేగంగా పెరుగుతుంది. మీరు కూడా ఈ సింపుల్ హోమ్ మేడ్ చిట్కాలను పాటిస్తే, మీ ఇంట్లోని మల్లె మొక్క కేవలం ఆకులతో నిండిపోకుండా, సువాసనలు వెదజల్లే తెల్లని మల్లెపూలతో కళకళలాడుతుంది.














