CSK vs LSG : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం చెపాక్ మైదానంలో జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన చెన్నై, ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్నో బౌలర్లను చిత్తు చేస్తూ సరికొత్త రికార్డులను తిరగరాశాడు.
ఉర్విల్ పటేల్ రికార్డు (CSK vs LSG) విధ్వంసం
ఈ మ్యాచ్‌కే హైలైట్ అంటే ఉర్విల్ పటేల్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అనే చెప్పాలి. కేవలం 13 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఒక ఫోర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఉర్విల్, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డును సమం చేశాడు. గతంలో యశస్వి జైస్వాల్ నెలకొల్పిన (CSK vs LSG) ఈ మైలురాయిని ఉర్విల్ చేరుకోవడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. మొత్తంగా 23 బంతుల్లో 63 పరుగులు చేసిన అతను, అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేసి మ్యాచ్‌ను పూర్తిగా చెన్నై వైపు తిప్పేశాడు.

రాణించిన ఓపెనర్లు.. ఫినిషింగ్ (CSK vs LSG) ఇచ్చిన దూబే
చెన్నై ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు సంజు శామ్సన్ (28), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42) మెరుపు వేగంతో పరుగులు రాబట్టారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 22 బంతుల్లోనే 45 పరుగులు జోడించి (CSK vs LSG) లక్నో బౌలర్లపై ఒత్తిడి పెంచారు. అయితే మధ్యలో బ్రెవిస్, కార్తిక్ శర్మ త్వరగా అవుట్ కావడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. కానీ చివర్లో శివం దూబే (15 నాటౌట్), ప్రశాంత్ వీర్ (18 నాటౌట్) సంయమనంతో ఆడుతూ మరో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు.
Read Also : Fitbit Air : ఫిట్‌నెస్ ప్రపంచంలో సరికొత్త విప్లవం.. స్క్రీన్ లేని ఫిట్‌నెస్ ట్రాకర్ ఆవిష్కరించిన గూగుల్.!
ఇంగ్లిస్ పోరాటం వృథా.. ఓవర్టన్ మ్యాజిక్
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగి 33 బంతుల్లో 85 పరుగులు బాదాడు. ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఒక దశలో లక్నో ఇంకా భారీ స్కోరు చేసేలా కనిపించినా, చెన్నై బౌలర్ జేమీ ఓవర్టన్ ఒకే ఓవర్లో ఇంగ్లిస్, రిషబ్ పంత్ వికెట్లు తీసి ఆ జట్టును గట్టి దెబ్బతీశాడు. చివర్లో షాబాజ్ అహ్మద్ (43 నాటౌట్) రాణించడంతో లక్నో 200 మార్కును దాటగలిగింది.
ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోగా, లక్నోకు ప్లేఆఫ్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 7 ముఖాముఖి పోరుల్లో చెన్నై 3, లక్నో 3 విజయాలతో సమానంగా ఉండటం విశేషం.













