తాజా వార్తలు

Morning habits: ఉదయాన్నే లేచారా? ఇలా చేస్తే రోజు మొత్తం గందరగోళమే!

morning habits telugu healthy lifestyle tips

Morning habits: ఉదయం లేచిన వెంటనే మనం చేసే పనులే రోజు ఎలా సాగుతుందో నిర్ణయిస్తాయి. కానీ మనలో చాలా మంది ఈ మొదటి గంటనే గందరగోళంగా మార్చేసుకుంటారు. ఏం ఉంది, ఇదే రొటీన్ అనుకుంటూ చేసే చిన్న చిన్న అలవాట్లు.. క్రమంగా పెద్ద సమస్యలుగా మారిపోతాయి. చాలామంది అలారం మోగగానే చేతికి పడేది మొబైల్. నిద్ర మత్తులోనే WhatsApp, Instagram, News.. ఇలా స్క్రోల్ మొదలవుతుంది. ఇదే మొదటి తప్పు. నిద్రలేచిన వెంటనే మెదడుకి విశ్రాంతి అవసరం. కానీ మనం ఇచ్చేది మాత్రం ఒత్తిడి. ఒక్కసారి ఆలోచించండి.. రోజు మొదలయ్యేలోపే మనం బయట ప్రపంచంలోకి వెళ్లిపోతున్నాం.

మరో కామన్ అలవాటు.. “ఇంకో 5 నిమిషాలు” అని మళ్లీ పడుకోవడం. ఈ 5 నిమిషాలే మన నిద్రను పూర్తిగా చెడగొడతాయి. మళ్లీ లేవగానే అలసటగా, బరువుగా ఫీల్ అవుతాం. ఆ రోజు మొత్తం కూడా అదే ఫీలింగ్ వెంటాడుతుంది. ఇంకా ఒక విషయం.. నిద్రలేచిన వెంటనే టీ లేదా కాఫీ. ఇది చాలా మందికి తప్పనిసరి. కానీ రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపులో నేరుగా కాఫీ పోతే, జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీని వల్ల గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు రావచ్చు.

నీళ్లు తాగడం మాత్రం చాలా మంది మర్చిపోతారు. రాత్రంతా మన శరీరం నీరు కోల్పోతుంది. ఉదయాన్నే ఒక గ్లాస్ నీళ్లు తాగితే శరీరం మెలకువలోకి వస్తుంది. కానీ మనం దానికంటే ముందే కాఫీకి ప్రాధాన్యం ఇస్తున్నాం.

ఉదయాన్నే చేసే చిన్న తప్పులు.. పెద్ద ప్రభావం
ఇవి చిన్న విషయాల్లా కనిపించినా, రోజూ చేస్తే ఆరోగ్యంపై గట్టిగా పడతాయి. ఉదాహరణకు, లేవగానే వెంటనే బెడ్ నుంచి దూకేయడం. ఇది రక్తపోటును ఒక్కసారిగా మార్చేస్తుంది. కొందరికి తలనిరుత్తి కూడా వస్తుంది. మరికొందరు బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తిగా స్కిప్ చేస్తారు. “టైమ్ లేదు” అని వదిలేస్తారు. కానీ ఉదయం ఆహారం తినకపోతే శరీరానికి అవసరమైన ఎనర్జీ దొరకదు. దాంతో మధ్యాహ్నానికి అలసట, చిరాకు మొదలవుతుంది.

Also Read: https://www.telugunews.co/summer-electricity-bill-saving-tips-telugu/

ఫోన్‌లో ఎక్కువగా టైమ్ గడపడం కూడా మరో పెద్ద సమస్య. ఉదయం మొదటి గంటలో మనం ఏం చేస్తామో.. అదే మన మైండ్‌సెట్‌ను సెట్ చేస్తుంది. కానీ మనం ఆ టైమ్‌ను ఫోన్‌కే ఇస్తున్నాం. దాంతో concentration తగ్గిపోతుంది. వ్యాయామం సంగతి వస్తే.. చాలా మంది “రేపటి నుంచి” అని వాయిదా వేస్తూనే ఉంటారు. కానీ ఉదయం చిన్నగా అయినా స్ట్రెచింగ్ లేదా వాకింగ్ చేస్తే శరీరం యాక్టివ్ అవుతుంది. లేకపోతే రోజంతా అలసటగా ఉంటుంది. ఇంకా ఒక విషయం ఉదయం కోపం, టెన్షన్. ఇంట్లో చిన్న విషయాలకే ఆవేశపడటం, తొందరగా రెడీ అవ్వాలనే ఆత్రం.. ఇవన్నీ రోజంతా మన మూడ్‌ను ప్రభావితం చేస్తాయి.

మంచి రోజు కావాలంటే.. ఇలా మొదలు పెట్టండి
రోజు బాగుండాలంటే పెద్దగా ఏం చేయాల్సిన పని లేదు. చిన్న చిన్న మార్పులు చాలు. మొదటగా, లేవగానే మొబైల్ దూరంగా పెట్టండి. కనీసం 20 నుండి 30 నిమిషాలు మీకోసం పెట్టండి. ఇది చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. లేవగానే నెమ్మదిగా కూర్చోండి. రెండు నిమిషాలు లోతుగా శ్వాస తీసుకోండి. తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది.

చిన్నగా స్ట్రెచింగ్ లేదా వాకింగ్ చేయండి. 10 నిమిషాలైనా సరే.. శరీరానికి చాలానే ఉపయోగపడుతుంది. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌ను తప్పకుండా తినండి. ఇది రోజు మొత్తం ఎనర్జీని ఇస్తుంది. మరొక ముఖ్యమైన విషయం రోజుకు ఒక ప్లాన్. ఉదయం 5 నిమిషాలు తీసుకుని “ఈ రోజు ఏం చేయాలి?” అనేది ప్లాన్ చేసుకుంటే, పనులు సులభంగా పూర్తవుతాయి. టెన్షన్ కూడా తగ్గుతుంది. చివరిగా ఉదయం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. మొదటి గంటలో కోపం, టెన్షన్ దూరంగా పెట్టండి. మీరు ఎలా మొదలుపెడతారో.. మీ రోజు కూడా అలాగే ఉంటుంది.

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.