DGP B Shivadhar Reddy : తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఒక సుదీర్ఘమైన , ఉజ్వలమైన అధ్యాయం ముగిసింది. సుమారు 32 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో అద్భుతమైన సేవలు అందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ నేడు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు RBVRR తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలోని సెరిమోనియల్ పరేడ్ గ్రౌండ్లో వైభవంగా వీడ్కోలు పరేడ్ నిర్వహించారు.
గౌరవ వందనం స్వీకరించిన (DGP B Shivadhar Reddy) శివధర్ రెడ్డి
ఏప్రిల్ 30, 2026న జరిగిన ఈ వీడ్కోలు వేడుకలో పోలీస్ అధికారులు , సిబ్బంది శివధర్ రెడ్డికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సి.వి. ఆనంద్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్టాతో (DGP B Shivadhar Reddy) పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శివధర్ రెడ్డి అందించిన సేవలను కొనియాడుతూ అకాడమీ ప్రాంగణం భావోద్వేగ భరితంగా మారింది.

32 ఏళ్ల ప్రస్థానం.. జ్ఞాపకాలు , (DGP B Shivadhar Reddy) అనుభవాలు
తన వీడ్కోలు ప్రసంగంలో శివధర్ రెడ్డి తన సుదీర్ఘ పోలీస్ సేవా జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. “32 ఏళ్ల నా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు (DGP B Shivadhar Reddy) ఎదుర్కొన్నాను, మరెన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకున్నాను. ఈ ప్రయాణంలో నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని ఆయన ఆవేదనగా పేర్కొన్నారు. 1970-80 కాలంలో ఉన్న పోలీసు వ్యవస్థతో పోలిస్తే నేడు సాంకేతికత , పనితీరులో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రస్తుతం పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అత్యంత ఆవశ్యకమని ఆయన ఉద్ఘాటించారు.
Read Also : AP SSC Results 2026 : 85.25 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు విడుదల చేసిన నారా లోకేశ్..!
తెలంగాణ ఉద్యమం, ఫ్రెండ్లీ పోలీసింగ్
తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై ఉన్న కొన్ని అపోహలను తొలగించడంలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. (DGP B Shivadhar Reddy) “ఉద్యమ సమయంలో పోలీసులపై ఉన్న దూరాన్ని తగ్గించడానికి, ప్రజలు-పోలీసుల మధ్య సాన్నిహిత్యం పెంపొందించడానికి మేము ‘సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాన్ని పకడ్బందీగా అమలు చేశాం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా (Future Ready) పోలీస్ శాఖను తీర్చిదిద్దాం” అని ఆయన వివరించారు.
ముఖ్యమంత్రికి (DGP B Shivadhar Reddy) కృతజ్ఞతలు
తన సొంత రాష్ట్రానికి డీజీపీగా సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి శివధర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కీలక బాధ్యతలు తనపై నమ్మకంతో అప్పగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన విజయాల వెనుక ఉన్న గురువులు, సీనియర్లు, సహచరులు , తన కుటుంబ సభ్యుల సహకారాన్ని కొనియాడారు. “సమిష్టి కృషి వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను” అని ఆయన వినమ్రంగా చెప్పారు.
యువ అధికారులకు దిశానిర్దేశం
యువ పోలీస్ అధికారులు , సిబ్బందికి ఆయన ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా చిత్తశుద్ధితో పనిచేయాలని, పోలీస్ శక్తి అంటే ప్రజల్లో గౌరవంగా జీవించడమేనని గుర్తు చేశారు. అలాగే నూతన డీజీపీగా రాబోతున్న సి.వి. ఆనంద్‌కు అభినందనలు తెలుపుతూ, “శాఖకు ఒక మంచి చాలెంజింగ్ అధికారి రాబోతున్నారు” అని ప్రశంసించారు.
శివధర్ రెడ్డి 32 ఏళ్ల సుదీర్ఘ సేవలు, ఆధునిక పోలీసింగ్‌కు ఆయన చేసిన కృషి తెలంగాణ పోలీస్ శాఖలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. ఆయన పదవీ విరమణ పొందినప్పటికీ, ఆయన చూపిన బాట రాబోయే తరాల పోలీస్ అధికారులకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.














