తాజా వార్తలు

Post Office New Rules : పోస్టాఫీసు ఖాతాదారులకు అలర్ట్.. మారిపోయిన నిబంధనలు.!

post-office-new-rules

Post Office New Rules : భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు అత్యంత నమ్మకమైన పొదుపు మార్గంగా ఉన్న పోస్టాఫీసు లావాదేవీల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు ప్రవేశపెట్టింది. నూతనంగా అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ప్రకారం, పోస్టాఫీసులో చేసే ప్రతి ఆర్థిక లావాదేవీకి సంబంధించి నిబంధనలను కఠినతరం చేస్తూ ఇండియా పోస్ట్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ , పెట్టుబడుల విషయంలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

ప్రతి లావాదేవీకి పాన్ (Post Office New Rules) కార్డు తప్పనిసరి

కొత్త మార్గదర్శకాల ప్రకారం, పోస్టాఫీసులో ఖాతా ఉన్నా లేకపోయినా, లేదా మీరు ఏదైనా చిన్న మొత్తాల పొదుపు పథకంలో కొత్తగా పెట్టుబడి పెడుతున్నా పాన్ కార్డు వివరాలను సమర్పించడం ఇకపై అనివార్యం. కేవలం సాధారణ పోస్టాఫీసు సేవలకే కాకుండా, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సేవలను వినియోగించుకునే (Post Office New Rules) వారు కూడా ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి చేసే ఆర్థిక లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షించడానికి , అధిక విలువ గల లావాదేవీల ద్వారా జరిగే పన్ను ఎగవేతను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

post-office-new-rules-1

పాన్ కార్డు లేని వారికి (Post Office New Rules) ప్రత్యామ్నాయం.. ఫారం 97

ఒకవేళ ఖాతాదారుడికి పాన్ కార్డు లేకపోతే, గతంలో ఉపయోగించిన ఫారం 60 స్థానంలో ఇప్పుడు సరికొత్తగా ఫారం 97ను ప్రవేశపెట్టారు. పాన్ కార్డు లేని వారు ఈ ఫారం 97ను పూరించి సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో సదరు వ్యక్తి యొక్క పూర్తి వ్యక్తిగత వివరాలు, లావాదేవీకి సంబంధించిన సమాచారం , గుర్తింపు కోసం అవసరమైన పత్రాలను జత చేయాలి. పాన్ లేకుండా జరిగే లావాదేవీలను కూడా పక్కాగా రికార్డు చేయడమే ఈ కొత్త ఫారం ఉద్దేశ్యం.

Read Also : Oben Rorr Evo : మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ Oben Rorr Evo.. అదిరిపోయే ఫీచర్లు, 180 కి.మీ రేంజ్.. ధర ఎంతంటే.?

ఫారం 121: 15G , 15Hల ఏకీకరణ

పోస్టాఫీసు పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్ (TDS) మినహాయింపు పొందాలనుకునే వారికి కూడా ప్రభుత్వం భారీ మార్పును సూచించింది. ఇప్పటివరకు వయస్సు , ఆదాయ పరిమితులను బట్టి విడివిడిగా ఉన్న ఫారం 15G , ఫారం 15Hలను ఇప్పుడు రద్దు చేసి, వాటి స్థానంలో ఒకే రకమైన ఫారం 121ను ఏకీకృతం చేశారు.

మొత్తం పన్ను విధించదగిన ఆదాయం సున్నా ఉన్నవారు మాత్రమే ఈ ఫారంను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఫారంను ప్రతి ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా కొత్తగా సమర్పించాలి. దీనివల్ల వేర్వేరు ఫారాల గందరగోళం తగ్గి, ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

పారదర్శకత, పర్యవేక్షణ

ఈ సంస్కరణల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడం. అధిక విలువ గల నగదు లావాదేవీలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా నల్లధనం ప్రవాహాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పోస్టాఫీసు ఖాతాదారులు తమ లావాదేవీలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే, వెంటనే తమ ఖాతాకు పాన్ కార్డును లింక్ చేసుకోవడం లేదా అవసరమైన ఫారాలను సిద్ధంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. రాబోయే రోజుల్లో ఈ నిబంధనలు మరింత పటిష్టంగా అమలు కానున్నాయి.

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.