Fitbit Air : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఫిట్నెస్ విభాగంలో ఒక భారీ మార్పును ప్రకటించింది. కేవలం స్మార్ట్‌వాచ్ ఫీచర్ల మీద మాత్రమే కాకుండా, కృత్రిమ మేధ (AI) ఆధారిత ఆరోగ్య మార్గదర్శకత్వానికి పెద్దపీట వేస్తూ ‘ఫిట్‌బిట్ ఎయిర్’ (Fitbit Air) పేరుతో సరికొత్త ఫిట్నెస్ ట్రాకర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. దీనితో పాటు ‘గూగుల్ హెల్త్’ యాప్‌ను కూడా గూగుల్ సిద్ధం చేసింది. హార్డ్‌వేర్ పరికరాల కంటే సాఫ్ట్వేర్ ఆధారిత ఆరోగ్య సాధనాలపై గూగుల్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు ఈ తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో బాస్కెట్‌బాల్ దిగ్గజం స్టీఫెన్ కర్రీ సహకారంతో ప్రత్యేక ఎడిషన్‌ను కూడా గూగుల్ లాంచ్ చేసింది.
స్క్రీన్ లేని వినూత్న డిజైన్.. (Fitbit Air) ఫిట్‌బిట్ ఎయిర్ ప్రత్యేకతలు
సాధారణంగా ఫిట్నెస్ బ్యాండ్లు అంటే చిన్న స్క్రీన్, గడియారం , నోటిఫికేషన్లతో కూడి ఉంటాయి. కానీ ఫిట్‌బిట్ ఎయిర్ వీటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి స్క్రీన్ లేదా గడియారం ఉండవు. కేవలం 12 గ్రాముల బరువుతో అత్యంత తేలికగా ఉండే ఈ పరికరం, (Fitbit Air) వినియోగదారుడు పదేపదే స్క్రీన్ వైపు చూసి ఇబ్బంది పడకుండా, నిశ్శబ్దంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆరోగ్య డేటాను సేకరించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. దీని సాధారణ వెర్షన్ ధర 100 డాలర్లు (సుమారు రూ. 8,300) కాగా, స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్ ధరను 130 డాలర్లుగా గూగుల్ నిర్ణయించింది.

AI విశ్లేషణతో వ్యక్తిగత ఆరోగ్య (Fitbit Air) పర్యవేక్షణ
ఫిట్‌బిట్ ఎయిర్ కేవలం పరికరం మాత్రమే కాదు, ఇది ఒక వ్యక్తిగత ఆరోగ్య కోచ్‌లా పనిచేస్తుంది. ఇది హృదయ స్పందన రేటు, నిద్ర దశలు, స్లీప్ స్కోర్ , గుండె లయలో మార్పులను (AFib alerts) నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఒత్తిడి స్థాయిలను అర్థం చేసుకోవడానికి అవసరమైన హెచ్ఆర్వీ (HRV) డేటాను సైతం ఇది సేకరిస్తుంది. నడక, రన్నింగ్, సైక్లింగ్ వంటి సుమారు 140 రకాల వ్యాయామాలను ఇది ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. గూగుల్ జెమిని (Gemini) ఆధారిత AI ఈ డేటాను విశ్లేషించి, వినియోగదారులకు వ్యక్తిగత ఫిట్నెస్ ప్లాన్లు , నిద్రకు సంబంధించిన సూచనలను అందిస్తుంది. మునుపటి మోడళ్ల కంటే ఇది 15 శాతం ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుందని గూగుల్ పేర్కొంది.
Read Also : Narendra Modi : హైదరాబాద్‌కు ప్రధాని మోడీ.. భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే.!
గూగుల్ హెల్త్ యాప్ , AI హెల్త్ కోచ్
మే 19 నుంచి ప్రస్తుతం ఉన్న ఫిట్‌బిట్ యాప్ ఆటోమేటిక్‌గా ‘గూగుల్ హెల్త్’ యాప్‌గా అప్డేట్ అవుతుందని సంస్థ ప్రకటించింది. వినియోగదారుల పాత డేటా అంతా ఈ కొత్త యాప్‌లోకి మారుతుంది. ఈ యాప్‌లో టుడే, ఫిట్నెస్, స్లీప్ , హెల్త్ అనే నాలుగు ప్రత్యేక విభాగాలు ఉంటాయి. గూగుల్ హెల్త్ ప్రీమియం సభ్యుల కోసం ప్రవేశపెట్టిన ‘AI హెల్త్ కోచ్’ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది యూజర్ డేటాతో పాటు మెడికల్ రిపోర్టులు , ఫోటోలను విశ్లేషించి, మెరుగైన వర్కవుట్ ప్లాన్లు , రికవరీ సలహాలను ఇస్తుంది.
అమ్మకాలు , లభ్యత
ఫిట్‌బిట్ ఎయిర్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉందని, మే 26 నుంచి అధికారికంగా అమ్మకాలు ప్రారంభమవుతాయని గూగుల్ తెలిపింది. అయితే, భారత మార్కెట్లో ఈ పరికరం ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆరోగ్య స్పృహ ఉన్నవారికి, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్ల గోల లేకుండా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే వారికి ఈ ఫిట్‌బిట్ ఎయిర్ ఒక గొప్ప ఎంపికగా నిలవనుంది.













