తాజా వార్తలు

AP SIPB : ఏపీ పారిశ్రామిక జాతర.. రూ. 2.10 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్..!

AP-SIPB

AP SIPB :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేలా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలలో సుమారు రూ. 2,01,023 కోట్ల భారీ పెట్టుబడులకు బోర్డు పచ్చజెండా ఊపింది. ఈ 25 భారీ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 39,067 మందికి ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

విశాఖలో రిలయన్స్ ‘డేటా’ విప్లవం.. (AP SIPB) రాయలసీమలో సోలార్ పవర్

ఈ సమావేశంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం రిలయన్స్ ఇండస్ట్రీస్ చేస్తున్న భారీ పెట్టుబడి. విశాఖపట్నంలో సుమారు రూ. 1,08,010 కోట్లతో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ముందుకు రావడం ఏపీ ఐటీ రంగానికి కొత్త ఊపిరి పోయనుంది. ఇది రాష్ట్రాన్ని (AP SIPB) అంతర్జాతీయ ఐటీ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెడుతుందని భావిస్తున్నారు. దీనికి తోడు, శ్రీసత్యసాయి జిల్లాలో రూ. 51,300 కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టును కూడా రిలయన్స్ నెలకొల్పనుంది. ఈ రెండు మెగా ప్రాజెక్టుల ద్వారా వేల సంఖ్యలో స్థానిక యువతకు ఉపాధి మార్గాలు తెరుచుకోనున్నాయి.

AP-SIPB-1

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి (AP SIPB) అదానీ వరకు

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమపాళ్లలో న్యాయం చేసేలా పెట్టుబడుల కేటాయింపులు జరిగాయి. ప్రసిద్ధ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ రూ. 2,508 కోట్లతో తన పరిశ్రమను తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయనుంది. దీనివల్ల 3,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే అపోలో (AP SIPB) టైర్స్ (రూ. 6,100 కోట్లు), క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ (రూ. 863 కోట్లు) పెట్టుబడులు పెడుతున్నాయి.

కడప జిల్లాలో అదానీ హైడ్రో ఎనర్జీ ఆధ్వర్యంలో రూ. 12,297 కోట్లతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. నెల్లూరులో ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ (రూ. 3,153 కోట్లు), పలనాడులో చెట్టినాడ్ సిమెంట్స్ (రూ. 1,340 కోట్లు) తమ యూనిట్లను స్థాపించనున్నాయి. వీటితో పాటు బయో ఫ్యూయల్స్, హైడ్రోజన్ రంగంలో యమాన్కో ఇండియా వంటి సంస్థలు వేల కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చాయి.

అనుమతుల్లో ఏపీ ఒక ‘బ్రాండ్’ కావాలి: సీఎం చంద్రబాబు

కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, పరిశ్రమలు క్షేత్రస్థాయిలో ఉత్పత్తులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు కఠిన ఆదేశాలిచ్చారు. “అనుమతుల జారీ నుంచి శంకుస్థాపన వరకు ప్రతి దశలోనూ నిర్దేశిత గడువును ఖచ్చితంగా పాటించాలి. అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక ‘బ్రాండ్’గా నిలవాలి” అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్క రోజు కూడా అనవసర జాప్యం జరగకూడదని, పోటీ ప్రపంచంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ వేగంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Read Also : Jailer 2 : బిజినెస్ లెక్కల్లో ట్విస్ట్.. రజనీ-నెల్సన్ కాంబోకు బయ్యర్ల సందేహాలు..!

రైతులకు మేలు.. ఎంఎస్ఎంఈలకు ఊతం

భారీ పరిశ్రమలతో పాటు మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమలకు (MSME) ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యుర్’ (ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త) అనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంఎస్ఎంఈలే కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆయిల్ పామ్, మామిడి, కొబ్బరి వంటి పంటలకు అదనపు విలువను (Value Addition) జోడించేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని సూచించారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతులతో ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ 17వ SIPB సమావేశం ఒక బలమైన పునాదిగా నిలిచింది.

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.