తాజా వార్తలు

Hyderabad Bengaluru Bullet Train : హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం!

Hyderabad Bengaluru Bullet Train

Hyderabad Bengaluru Bullet Train : హైదరాబాద్ , బెంగళూరు నగరాల మధ్య ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చబోతున్న హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ ప్రతిష్టాత్మక మార్గానికి తాజాగా కర్ణాటక మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు తమ మద్దతు ప్రకటించగా, ఇప్పుడు కర్ణాటక కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కారిడార్ నిర్మాణానికి ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయి పనుల్లో వేగం పెరగనుంది. భూసేకరణ వంటి కీలక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు కోరుతున్న కేంద్రానికి, కర్ణాటక కేబినెట్ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.

రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం (Hyderabad Bengaluru Bullet Train) భారీగా తగ్గింపు

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవాలంటే రైళ్లలో కనీసం 8 నుంచి 19 గంటల సమయం పడుతోంది. అత్యంత వేగంగా వెళ్లే రైళ్లలో కూడా ప్రయాణికులు సుమారు 8 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోంది. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ఈ రెండు (Hyderabad Bengaluru Bullet Train) ఐటీ హబ్‌ల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు తగ్గిపోనుందని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ రెండు నగరాల మధ్య తరచూ ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు , వ్యాపారవేత్తలకు ఈ హైస్పీడ్ కారిడార్ ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. సుమారు 626 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కారిడార్‌లో రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి.

Hyderabad Bengaluru Bullet Train

కారిడార్ మార్గం, (Hyderabad Bengaluru Bullet Train) స్టేషన్ల వివరాలు

ఈ హైస్పీడ్ కారిడార్ మొత్తం 12 స్టేషన్లను కలిగి ఉంటుందని ప్రాథమిక సమాచారం. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రారంభమయ్యే ఈ కారిడార్ ప్రధానంగా ఎలివేటెడ్ లైన్‌పై నిర్మించనున్నారు. ఈ మార్గంలో 101 కిలోమీటర్లు కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది, అక్కడ అలీపుర, (Hyderabad Bengaluru Bullet Train) దేవనహళ్లి , కోడిహళ్లి రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూపురం, అనంతపురం , కర్నూలు నగరాల్లో స్టేషన్లు ఉండనుండగా, తెలంగాణ పరిధిలో మహబూబ్‌నగర్‌లో ఒక స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.

Read Also : AP Pensions : ఏపీలో కొత్త పింఛన్ల పండుగ.. ఎన్టీఆర్ భరోసా పథకం దరఖాస్తు ప్రక్రియ , పూర్తి వివరాలు

వచ్చే ఏడాది డీపీఆర్ సిద్ధం.. భూసేకరణపై దృష్టి

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి రైల్వే శాఖ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ‘రైట్స్ లిమిటెడ్’ సంస్థ ఇటీవల ఈ మార్గంలో సర్వే పనులను ప్రారంభించింది. 2027 మార్చి నాటికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) పూర్తి కానుందని సమాచారం. భూసేకరణ ప్రక్రియను సజావుగా పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనితో పాటు హైదరాబాద్ నుంచి చెన్నై , పుణె నగరాలకు కూడా బుల్లెట్ రైలు కారిడార్లను నిర్మించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.