తాజా వార్తలు

Tamil Nadu Elections 2026 : తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. ఏఐఏడీఎంకేతో పొత్తు ఖాయమేనా?

Tamil-Nadu-Elections-2026-1

Tamil Nadu Elections 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (2026) కౌంటింగ్ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతోంది. దశాబ్దాలుగా ద్రావిడ రాజకీయాలను శాసిస్తున్న దిగ్గజ పార్టీలకు దీటుగా, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) తొలి ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం టీవీకే ఏకంగా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో, చెన్నై రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఫలితాలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వని పక్షంలో, అధికార పీఠం కోసం కొత్త పొత్తుల సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.

విజయ్ పార్టీతో అన్నాడీఎంకే (Tamil Nadu Elections 2026) పొత్తు?

ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) ఏ కూటమికీ రాకపోతే, అప్పుడు విజయ్ పార్టీ ఎవరితో జతకడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా AIADMK (అన్నాడీఎంకే) , TVK మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ రెండు (Tamil Nadu Elections 2026) పార్టీల మధ్య గత కొన్ని నెలలుగా సాగిన రాజకీయ వైరం చూస్తుంటే ఇది అంత సులభంగా తేలేలా కనిపించడం లేదు. గతంలో పరస్పర విమర్శలు , మాటల యుద్ధం చేసుకున్న ఈ రెండు పార్టీలు, ఇప్పుడు అధికారం కోసం పాత విభేదాలను పక్కన పెట్టి చేతులు కలిపే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tamil-Nadu-Elections-2026

విఫలమైన గత చర్చలు.. విజయ్ కఠిన (Tamil Nadu Elections 2026) నిబంధనలు!

వాస్తవానికి, గత ఏడాది (2025) చివరలోనే అన్నాడీఎంకే , విజయ్ పార్టీ మధ్య పొత్తు కోసం అనధికారికంగా ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే, అప్పట్లో విజయ్ పెట్టిన కొన్ని కఠినమైన నిబంధనల వల్ల ఆ చర్చలు కార్యరూపం దాల్చలేదు. కూటమికి తానే నాయకత్వం వహించాలని, (Tamil Nadu Elections 2026) ముఖ్యమంత్రి అభ్యర్థిగా తననే ప్రకటించాలని , సగానికి పైగా సీట్లు (117 కంటే ఎక్కువ) టీవీకే పార్టీకే కేటాయించాలని విజయ్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దశాబ్దాల చరిత్ర ఉన్న అన్నాడీఎంకే, ఒక కొత్త పార్టీకి అంతటి ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధపడకపోవడంతో అప్పట్లో ఆ చర్చలు బెడిసికొట్టాయి.

Read Also : West Bengal Election Results 2026 : బీజేపీ – టీఎంసీ మధ్య హోరాహోరీ.. ఫలితాలను శాసిస్తున్న ఏడు ‘M’ ఫ్యాక్టర్స్.!

అధికార అవసరం కోసమే కొత్త కూటమి?

కానీ, ప్రస్తుత ఫలితాలు విజయ్ పార్టీని ఒక బలమైన శక్తిగా నిలబెట్టాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏ కూటమికీ 118 సీట్లు రాకపోతే, అప్పుడు అన్నాడీఎంకే , టీవీకే కలవక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది జరగాలంటే రెండు వైపుల నుంచి పెద్ద త్యాగాలే చేయాల్సి ఉంటుంది. విజయ్ నాయకత్వాన్ని ఎడప్పాడి పళనిస్వామి అంగీకరించాల్సి ఉంటుంది, అదే సమయంలో “ఒంటరి పోరాటం” అని నినదించిన విజయ్ కూడా తన మాటను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అది రాజకీయ ఆశావాదం కంటే, కేవలం అధికార అవసరం కోసం ఏర్పడే కూటమిగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Read Also : 5 star vs inverter AC : 5-స్టార్ ఏసీ వర్సెస్ ఇన్వర్టర్ ఏసీ.. మీ ఇంటికి ఏది ఉత్తమమైన ఎంపిక.?

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.