Turtle Viral Video : సోషల్ మీడియా యుగంలో అప్పుడప్పుడు మనం ఊహించని వింతలు, విశేషాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా క్రిస్టోఫర్ చాంగ్ అనే ఓ యాత్రికుడు సముద్ర గర్భంలో స్కూబా డైవింగ్ చేస్తూ రికార్డు చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సముద్రంలోని అందాలను ఆస్వాదించేందుకు వెళ్ళిన అతనికి, ప్రకృతి ఎప్పుడూ ఇవ్వని ఒక వింతైన , సరదా అనుభవాన్ని మిగిల్చింది. సాధారణంగా సముద్ర జీవులు మనుషులను చూస్తే భయపడి దూరంగా వెళ్ళిపోతాయి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవ్వడమే ఈ వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణం.
అనూహ్యంగా స్పందించిన (Turtle Viral Video) సముద్ర తాబేలు
క్రిస్టోఫర్ చాంగ్ సముద్రపు లోతుల్లో స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో, ఒక సముద్ర తాబేలు అనూహ్యంగా అతని వద్దకు వచ్చింది. సాధారణంగా తాబేళ్లు చాలా సిగ్గుపడే స్వభావం కలిగి ఉంటాయి, (Turtle Viral Video) మనుషుల ఉనికిని గమనిస్తే క్షణాల్లో అక్కడి నుంచి మాయమవుతాయి. కానీ ఈ తాబేలు మాత్రం చాంగ్ను చూసి వెనక్కి వెళ్ళకుండా, అతడినే గమనిస్తూ అతని చుట్టూ తిరగడం ప్రారంభించింది. అతను ఏ దిశగా కదులుతున్నా, ఆ తాబేలు నీడలా అతని చుట్టూనే తిరుగుతూ ఒక రకమైన వింత ఉత్సుకతను ప్రదర్శించింది.

ఊహించని ‘చెంపదెబ్బ’.. (Turtle Viral Video) ఖంగుతిన్న డైవర్
తాబేలు తన చుట్టూ తిరగడాన్ని చాంగ్ కెమెరాలో బంధిస్తుండగా, ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ తాబేలు నేరుగా అతని ముఖం వైపునకు దూసుకొచ్చి, తన రెక్కతో చాంగ్ చెంపపై చిన్నగా ఒక దెబ్బ కొట్టేసి, ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు దూరంగా వెళ్ళిపోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి చాంగ్ ఆశ్చర్యపోయాడు. తన జీవితంలో వందల సార్లు తాబేళ్లను చూశానని, కానీ తనపైకి వచ్చి ఇలా ‘దాడి’ చేయడం లేదా సరదాగా కొట్టడం వంటి అనుభవం గతంలో ఎప్పుడూ ఎదురవ్వలేదని అతను తన సామాజిక మాధ్యమ వేదికగా రాసుకొచ్చాడు.
Read Also : Mission Drishti : అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.. నింగిలోకి మొట్టమొదటి ‘ఆప్టో-సార్’..!
నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ , వైరల్ వీడియో
ఈ వింత అనుభవాన్ని చాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఒక నెటిజన్ “అనుమతి లేకుండా నువ్వు వేరే వాళ్ళ ఇంట్లోకి (సముద్రంలోకి) వచ్చి చప్పుడు చేస్తున్నావు, అందుకే ఆ తాబేలు నోరు మూసుకోమని నీకు కొట్టింది” అని సరదాగా కామెంట్ చేయగా, మరొకరు “పర్మిషన్ లేకుండా వీడియోలు తీస్తే తాబేళ్లకు కూడా కోపం వస్తుంది మరి” అంటూ చమత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతమైన వ్యూస్ , షేర్లతో దూసుకుపోతోంది.














