Spirit movie: సినిమా షూటింగ్ అంటే బయటకు కనిపించేది గ్లామర్ మాత్రమే. కానీ సెట్స్‌లో జరిగే ప్రతీ పని చాలా జాగ్రత్తగా, నియంత్రణలో ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా సెట్లో చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. సమాచారం ప్రకారం, ముంబైలోని ఒక స్టూడియోలో వేసిన సెట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో సెట్లో ఒక్కసారిగా అగ్ని చెలరేగింది. ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, కొన్ని షూటింగ్ సామాగ్రి మంటల్లో కాలిపోయాయి. అగ్ని పెద్దగా వ్యాపించకముందే సహాయక బృందం వెంటనే స్పందించడం వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఈ ఘటనలో ఒక సహాయక సిబ్బందికి స్వల్ప గాయాలు కావడం జరిగింది. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స అందించినట్లు తెలుస్తోంది. పెద్ద ప్రమాదం జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం వల్ల మిగతా యూనిట్ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో హీరో ప్రభాస్ సెట్లో లేరు. దీంతో అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
సోషల్ మీడియాలో మొదట ఈ విషయం వైరల్ కావడంతో కొందరు టెన్షన్‌కు గురయ్యారు. కానీ అధికారిక సమాచారం వచ్చాక పరిస్థితి అంత సీరియస్ కాదని స్పష్టమైంది. సినిమా సెట్స్‌లో అగ్ని ప్రమాదాలు కొత్త విషయం కాదు. భారీ లైటింగ్, ఎలక్ట్రికల్ సెటప్, టెంట్లు, ఇతర వస్తువులు.. అన్నీ ఇవి ఒకే చోట ఉండటం వల్ల చిన్న స్పార్క్ కూడా ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే సాధారణంగా షూటింగ్ లొకేషన్లలో ఫైర్ సేఫ్టీ మేజర్లు తీసుకుంటారు.
ప్రభాస్ అభిమానులకు రిలీఫ్.. షూటింగ్‌పై ప్రభావం?
ఈ ఘటన తర్వాత ప్రధానంగా అందరి దృష్టి ఒకటే.. “ప్రభాస్ సేఫ్ కదా?” అన్నదే. అదృష్టవశాత్తూ, ప్రభాస్ ఈ ఘటన సమయంలో సెట్లో లేకపోవడం పెద్ద ఊరటనిచ్చింది. అందువల్ల ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు. సినిమా షూటింగ్‌పై పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: https://www.telugunews.co/allu-arjun-raaka-cake-birthday-celebration-clue/
కొంత సామాగ్రి, టెంట్లు దెబ్బతిన్నా, అవి త్వరగా రీప్లేస్ చేయగలిగేవే. కాబట్టి షూటింగ్ షెడ్యూల్లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ఇంకా ఒక విషయం స్పష్టంగా చెప్పాల్సిందే.. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇది యూనిట్‌కు పెద్ద ప్లస్ పాయింట్. అటు నిర్మాతలు, దర్శకుడు, సిబ్బంది అందరూ వెంటనే స్పందించడం వల్ల పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. ప్రస్తుతం సెట్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసే అవకాశముంది. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సిస్టమ్ చెక్ వంటి విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఈ ఘటనపై మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు ఇది చిన్న సంఘటన మాత్రమే అని భావిస్తుండగా, మరికొందరు షూటింగ్ సెట్స్‌లో సేఫ్టీ మెజర్స్ ఇంకా పెంచాలని అంటున్నారు. అయితే మొత్తానికి చూస్తే, ఇది పెద్ద ప్రమాదంగా మారకుండా నియంత్రించబడింది. అభిమానులు కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సినిమా సెట్స్‌లో చిన్న సంఘటనలు పెద్ద చర్చగా మారడం సహజమే. కానీ ఈసారి ‘స్పిరిట్’ సెట్లో జరిగిన అగ్ని ప్రమాదం పెద్ద ప్రమాదంగా మారకముందే అదుపులోకి రావడం యూనిట్‌కు పెద్ద ఉపశమనం. ప్రభాస్ సేఫ్.. షూటింగ్ కొనసాగుతుంది.. టెన్షన్ అవసరం లేదు.. అయితే ఈ ఘటనపై సినిమా యూనిట్ నుంచి అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది.














