తాజా వార్తలు

Iran – America: ఇక్కడ సంబరాలు.. అక్కడ కాల్పులు? వాట్ నెక్స్ట్!

iran missile attack israel after ceasefire trump global tension

Iran – America: ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంది అనుకున్న సమయానికే మరో షాక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన గంటలు కూడా గడవకముందే, మధ్యప్రాచ్యం మళ్లీ మంటల్లో కరిగిపోయింది. ఇరాన్ వీధుల్లో వాతావరణం ఇప్పటికే ఉత్కంఠభరితంగా ఉంది. ట్రంప్ ఇచ్చిన గడువు ముగిసే సమయానికి లక్షలాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి, తమ దేశానికి మద్దతుగా నినాదాలు చేశారు.

దేశభక్తి ఉత్సాహం ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో, ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా ఎంబసీ బయట కూడా గుమిగూడిన ప్రజలు కాల్పుల విరమణ ప్రకటనను సంబరంగా జరుపుకున్నారు. అయితే ఆ సంబరం ఎక్కువ సేపు నిలవలేదు. ట్రంప్ ప్రకటన చేసిన కేవలం రెండు గంటల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఇరాన్ నుంచి ప్రయోగించిన మిస్సైళ్లు ఇజ్రాయెల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. క్లస్టర్ వార్‌హెడ్స్‌తో జరిగిన ఈ దాడుల్లో కనీసం 11 మంది గాయపడినట్టు సమాచారం. పలు ప్రాంతాల్లో పేలుళ్లు, ధ్వంసం నమోదయ్యాయి. ఒక్కసారిగా ప్రపంచం మళ్లీ అదే ప్రశ్న అడగడం మొదలుపెట్టింది.. ఇది ceasefireనా? లేక మరో పెద్ద యుద్ధానికి ప్రారంభమా? ట్రంప్ ప్లాన్ ఫెయిలైందా? లేక ఇది ఇంకా పెద్ద గేమ్‌లో భాగమా?

ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణతో ఉద్రిక్తతలు తగ్గుతాయని భావించినవారికి ఇది పెద్ద షాక్. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ఇలాంటి దాడి జరగడం, మొత్తం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఇరాన్ మద్దతుదారులు ఈ పరిణామాలను వేరే కోణంలో చూస్తున్నారు. వారి దృష్టిలో ఇది అమెరికాపై విజయంగా కనిపిస్తోంది. “మేము వెనక్కి తగ్గలేదు” అనే సంకేతంగా ఈ దాడిని భావిస్తున్నారు.

Also Read: https://www.telugunews.co/trump-changing-decisions-iran-ceasefire-analysis/

ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది.. ట్రంప్ తీసుకున్న నిర్ణయం తప్పు అంచనా వేసినదా? లేక ముందే తెలిసినా తీసుకున్న రిస్క్ మూవ్‌నా? ఇలాంటి పరిస్థితుల్లో మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో ఇట్టే చెప్పేయవచ్చు. ఒక్క ప్రకటన, ఒక్క ట్వీట్.. ఒక్క దాడి, ఒక్క ప్రతిదాడి.. ఇవన్నీ కేవలం స్థానిక పరిణామాలు కాదు.

ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, రాజకీయ సమీకరణాలపై నేరుగా ప్రభావం చూపించే అంశాలు. ఇక ట్రంప్ స్టైల్ గురించి చూస్తే, ఆయన ఎప్పుడూ ఒకే లైన్‌లో నడవరు. ముందుగా ఒత్తిడి పెంచడం, తర్వాత సడన్‌గా మార్పు చూపించడం.. ఇది ఆయన రాజకీయ వ్యూహంలో భాగం. కానీ ఈసారి పరిస్థితి ఆయన అంచనాలకు మించి వెళ్లిందా? అనే సందేహం కూడా కనిపిస్తోంది.

ముందు ఏమవుతుంది? ప్రపంచం మళ్లీ టెన్షన్‌లో
ఇప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, నేలమీద దాడులు కొనసాగితే అది పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుంది? అమెరికా మళ్లీ కఠిన వైఖరి తీసుకుంటుందా? ఇరాన్ తన చర్యలను కొనసాగిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే గంటల్లోనే తెలుస్తుంది. ఈ గేమ్ ఇంకా పూర్తవ్వలేదు. ఇది కేవలం మొదటిపేజీ మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. ప్రపంచం మొత్తం ఇప్పుడు మరో పెద్ద పరిణామం కోసం ఎదురుచూస్తోందా అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఆల్ వెయిట్ ప్లీజ్!

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.