CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో ఫుల్ బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం 10 గంటలకే దేశ రాజధానికి చేరుకోనున్న సీఎం, వరుసగా కేంద్ర మంత్రులతో మీటింగ్స్ ప్లాన్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు , కేంద్రం నుండి రావాల్సిన సహకారం గురించి ఈ భేటీల్లో ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి, వీలైనంత త్వరగా నిధులు , పర్మిషన్లు సాధించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం.
అమిత్ షా , సీఆర్ పాటిల్‌తో (CM Chandrababu) హై-లెవల్ మీటింగ్స్
ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్ర భద్రత, పరిపాలన , వివిధ డెవలప్‌మెంట్ ఇష్యూస్‌పై వీరిద్దరి మధ్య చర్చ జరగనుంది. దీనికి తోడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా సీఎం సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం (River Linking) , జలవనరుల అభివృద్ధిపై (CM Chandrababu) ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పోలవరం లాంటి పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నుండి రావాల్సిన సాయంపై సీఎం స్పెషల్ గా ఫోకస్ చేయనున్నారు.

వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ.. పెట్టుబడులే టార్గెట్
మధ్యాహ్నం టైమ్‌లో ప్రపంచ బ్యాంకు (World Bank) ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, కొత్త పెట్టుబడులు , పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఆర్థిక సహకారం కోరనున్నారు. వరల్డ్ బ్యాంక్ మద్దతుతో ఏపీలో అమలు (CM Chandrababu) చేయదగిన పలు మెగా ప్రాజెక్టులపై ప్రభుత్వం ఇప్పటికే ఒక బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఈ మీటింగ్ ద్వారా ఏపీకి భారీగా ఫండింగ్ వచ్చేలా సీఎం ప్లాన్ చేస్తున్నారు.
Read Also : Warren Buffett : వారెన్ బఫెట్ విజయ రహస్యం.. అమ్మ పెట్టిన కఠిన నియమాలే ఆయనను ప్రపంచ కుబేరుడిని చేశాయా.?
సీఐఐ సమ్మిట్.. ఏపీకి పారిశ్రామిక కళ
సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్‌లో నిర్వహించే సీఐఐ (CII) బిజినెస్ సమ్మిట్‌లో సీఎం పాల్గొననున్నారు. దేశీ , అంతర్జాతీయ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొనే ఈ వేదికపై ఏపీలో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాల గురించి సీఎం ప్రసంగించనున్నారు. ఇండస్ట్రీలకు ప్రభుత్వం అందిస్తున్న ఇన్సెంటివ్స్ , ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి వివరిస్తూ, రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన స్పీచ్ ఉండబోతోంది.
ఢిల్లీ నుండి నేరుగా అస్సాం పర్యటనకు..
ఇవాళ రాత్రికి ఢిల్లీ పర్యటన ముగించుకున్న తర్వాత సీఎం చంద్రబాబు నేరుగా గౌహతి (అస్సాం) బయల్దేరనున్నారు. అక్కడ జరిగే కొన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చేస్తున్న ఈ ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా కీలకంగా మారిందని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం నుండి ఏపీకి ఎలాంటి హామీలు వస్తాయో చూడాలి.













