తాజా వార్తలు

Rajasthan Royals : ఐపీఎల్‌లో మెగా డీల్.. రూ. 15,660 కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్..

Rajasthan-Royals

Rajasthan Royals : భారత ప్రీమియర్ లీగ్ (IPL) వేదికగా మరో భారీ వ్యాపార ఒప్పందం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలల క్రితమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్య మార్పుతో వార్తల్లో నిలవగా, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా కొత్త యజమానుల చేతుల్లోకి వెళ్ళింది. స్టీల్ రంగ దిగ్గజం మిట్టల్ కుటుంబం , ప్రముఖ వ్యాపారవేత్త అదర్ పూనావాలా సంయుక్తంగా ఈ జట్టును రికార్డు స్థాయిలో సుమారు 1.85 బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో రూ. 15,660 కోట్లు) దక్కించుకున్నారు. ఈ మెగా డీల్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఒక అమెరికన్ సంస్థ కొనుగోలు చేస్తుందనే ఊహాగానాలకు పూర్తిగా తెరపడింది.

వాటాల లెక్కలు , గ్లోబల్ (Rajasthan Royals) విస్తరణ

ఈ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ అంతా 2026 మూడవ త్రైమాసికం నాటికి పూర్తి కానుంది. ఈ నూతన భాగస్వామ్యంలో మిట్టల్ కుటుంబం సింహభాగం అంటే 75 శాతం వాటాను కలిగి ఉండగా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా 18 శాతం వాటాను సొంతం (Rajasthan Royals) చేసుకున్నారు. మిగిలిన 7 శాతం వాటాను ప్రస్తుత యజమాని మనోజ్ బదాలేతో పాటు ఇతర ఇన్వెస్టర్లు కొనసాగించనున్నారు. విశేషమేమిటంటే, ఈ ఒప్పందం కేవలం ఐపీఎల్ జట్టుకే పరిమితం కాలేదు. దీని ద్వారా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోని ‘పార్ల్ రాయల్స్’ , కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లోని ‘బార్బడోస్ రాయల్స్’ జట్లు కూడా కొత్త యాజమాన్యం పరిధిలోకి చేరాయి.

Rajasthan-Royals-1

సొంత గడ్డపై మమకారంతో మిట్టల్ (Rajasthan Royals) కుటుంబం అడుగులు

లక్ష్మీ ఎన్. మిట్టల్ రాజస్థాన్‌లోని సాదుల్‌పూర్ గ్రామంలో జన్మించిన వ్యక్తి కావడం వల్ల, ఈ జట్టు కొనుగోలు వెనుక బలమైన సెంటిమెంట్ కూడా కనిపిస్తోంది. తన సొంత రాష్ట్రానికి చెందిన జట్టును దక్కించుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, క్రికెట్ పట్ల తనకున్న మక్కువను, రాజస్థాన్ మట్టితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇకపై ఆదిత్య మిట్టల్, వనీషా మిట్టల్ కూడా బోర్డు సభ్యులుగా చేరి, జట్టు వారసత్వాన్ని కాపాడటంతో పాటు యువ ప్రతిభను ప్రోత్సహించే బాధ్యతను తీసుకోనున్నారు. అటు అదర్ పూనావాలా కూడా ఈ పెట్టుబడిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆదిత్య మిట్టల్‌తో కలిసి జట్టును దీర్ఘకాలంలో విజయపథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. 2008 నుంచి జట్టును నడిపిస్తున్న మనోజ్ బదాలే, కొత్త యజమానులు రాయల్స్‌ను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : Netanyahu: నింగిలో ఇజ్రాయెల్ యుద్ధ హుంకార.. ఇరాన్ గగనతలంలోకి చొచ్చుకెళ్తామంటూ హెచ్చరిక..



ప్రస్తుత సీజన్‌లో రాయల్స్ సత్తా

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న రాజస్థాన్, ప్లే ఆఫ్ రేసులో బలంగా కొనసాగుతోంది. టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ కంటే కేవలం ఒకే ఒక్క పాయింట్ వెనుకబడి ఉన్న రాయల్స్, ఇప్పుడు కొత్త యాజమాన్య మార్పుతో వచ్చే ఉత్సాహంతో టైటిల్ దిశగా అడుగులు వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మార్పు జట్టులో సరికొత్త జోష్ నింపుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : 5 star vs inverter AC : 5-స్టార్ ఏసీ వర్సెస్ ఇన్వర్టర్ ఏసీ.. మీ ఇంటికి ఏది ఉత్తమమైన ఎంపిక.?

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.