Dacoit OTT : వైవిధ్యమైన థ్రిల్లర్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు అడివి శేష్. సాధారణంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చేసే ఆయన, ఈసారి దానికి భిన్నంగా యాక్షన్ , ఎమోషనల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో నటించిన చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). థియేటర్లలో ఇప్పటికే సందడి చేసిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం మే 8వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్ర దర్శకుడు షానియెల్ డియోతో కలిసి అడివి శేష్ స్వయంగా కథ , స్క్రీన్‌ప్లే రాయడం ఒక విశేషం. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, కీలక పాత్రల్లో అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి, ప్రకాశ్‌రాజ్ వంటి దిగ్గజ నటులు నటించారు.
జైలు నుంచి పరారీ , (Dacoit OTT) ప్రతీకారేచ్ఛ
ఈ సినిమా కథ ప్రధానంగా హరిదాస్ (అడివి శేష్) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక హత్య కేసులో సుమారు 13 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. ఒకరోజు అతనిని కడప జైలు నుంచి వేరే చోటికి మారుస్తుండగా, ఇషాద్ భాయ్ (అతుల్ కులకర్ణి) అనే వ్యక్తి సాయంతో (Dacoit OTT) పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. జైలు నుండి పరారైన హరి ఎలాగైనా దుబాయ్ వెళ్లిపోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. అయితే దుబాయ్‌కి వెళ్లేందుకు అతనికి ఇంకా రూ. 60 లక్షల వరకు అదనపు నిధులు అవసరమవుతాయి. ఈ డబ్బు సంపాదించడంతో పాటు, తనను జైలు పాలు కావడానికి కారణమైన తన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) పై పగ తీర్చుకోవాలని హరి బలంగా నిర్ణయించుకుంటాడు.

Read Also : CM Revanth Reddy : ఉద్యోగులకు ‘రేవంత్’ భరోసా.. వంద రోజుల్లో రూ. 6 వేల కోట్ల బకాయిల చెల్లింపు..!
ఊహించని మలుపులు.. (Dacoit OTT) ఆసక్తికర క్లైమాక్స్
తన ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్లిన హరికి అక్కడ కొన్ని ఊహించని నిజాలు ఎదురవుతాయి. సరస్వతికి ప్రస్తుతం ఆరేళ్ల కూతురు ఉంటుందని, ఆమె భర్త భాస్కర్ (వైభవ్) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అతను తెలుసుకుంటాడు. సరస్వతి ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక ఇబ్బందులు , క్లిష్ట పరిస్థితిని గమనించిన హరి, తన పగను తీర్చుకోవడానికి ఆమె బలహీనతనే ఆయుధంగా మార్చుకోవాలని ఒక వ్యూహం రచిస్తాడు. అసలు హరి , సరస్వతి గతంలో ఎందుకు విడిపోయారు, హరి తన జీవితంలోకి తిరిగి వచ్చాక సరస్వతి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. ఈ ఉత్కంఠభరితమైన యాక్షన్ లవ్ స్టోరీని చూడాలనుకునే వారు మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.
Read Also : Good News : తిరుమల భక్తులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్ 3 ప్రత్యేక రైళ్లు..!














