తాజా వార్తలు

Prabhas Spirit : స్పిరిట్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..

Prabhas-Spirit-1

Prabhas Spirit : రెబల్ స్టార్ ప్రభాస్ , సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సందీప్, ఇప్పుడు ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతుండటంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సందీప్ రెడ్డి వంగా పక్కా ప్లానింగ్.. (Prabhas Spirit) సెప్టెంబర్ లోపే ప్యాకప్!

సాధారణంగా ప్రభాస్ సినిమాలు భారీ బడ్జెట్ , పాన్ ఇండియా లెవెల్ కావడంతో షూటింగ్ , రిలీజ్ డేట్స్ విషయంలో కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అయితే ‘స్పిరిట్’ విషయంలో సందీప్ రెడ్డి వంగా చాలా పక్కాగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, (Prabhas Spirit) సందీప్ ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికే పూర్తి చేయాలని ఒక డెడ్‌లైన్ పెట్టుకున్నారట. ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్‌మెంట్ విషయంలో కొన్ని వార్తలు వినిపించినప్పటికీ, సందీప్ మాత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట.

Prabhas-Spirit

పోస్ట్ ప్రొడక్షన్ పై (Prabhas Spirit) స్పెషల్ ఫోకస్

సెప్టెంబర్ లోపు షూటింగ్ ముగించిన వెంటనే, సందీప్ తన పూర్తి సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ , విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పై కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నారట. ఏది ఏమైనా సరే, ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌ను పక్కాగా పూర్తి చేయడమే కాకుండా, మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు.

Read Also : H-City : హైదరాబాద్‌ రూపురేఖలు మార్చబోతున్న ‘H-City’ ప్రాజెక్ట్

2027 మార్చి 5న గ్రాండ్ (Prabhas Spirit) రిలీజ్

ఈ సినిమాను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘స్పిరిట్’లో ప్రభాస్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా, చాలా రా అండ్ రస్టిక్ గా ఉండబోతోందని సమాచారం. సందీప్ మార్క్ ఎమోషన్స్, వైలెన్స్‌తో పాటు పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని ఇస్తాయని ఇండస్ట్రీ టాక్.

Read Also : Lucky Zodiac Signs : మే 14 నుండి ‘గజలక్ష్మీ రాజయోగం’.. ఈ రాశుల వారి ఇంట కనక వర్షమే.!

కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయనున్న మేకింగ్

‘స్పిరిట్’ కంటెంట్ సందీప్ గత చిత్రాల కంటే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. టెక్నికల్ వాల్యూస్ నుండి సౌండ్ డిజైనింగ్ వరకు ప్రతిదీ హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండియన్ సినిమాలో పోలీస్ డ్రామా అనగానే గుర్తొచ్చే చిత్రాల్లో ‘స్పిరిట్’ ఒక కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి..

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.