Mosquitoes and Alcohol : దోమల నివారణకు మనం ఎన్నో రకాల కాయిల్స్, లోషన్లు వాడుతుంటాం. కానీ, కొన్నిసార్లు పక్కన ఉన్నవారందరినీ వదిలేసి దోమలు కేవలం ఒకరినే లక్ష్యంగా చేసుకుని కుడుతుంటాయి. దీనికి కారణం వారి రక్త గ్రూపు లేదా వేసుకున్న బట్టలు అని మనం అనుకుంటాం. (Mosquitoes and Alcohol) అయితే, మీరు మద్యం సేవించి ఉంటే దోమలకు మీరు మరింత ఇష్టమైన ఆహారంగా మారుతారని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆల్కహాల్ తాగిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులు దోమలను అయస్కాంతంలా ఆకర్షిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మద్యం తాగిన వారిపై దోమల (Mosquitoes and Alcohol) దాడికి ప్రధాన కారణాలు
మద్యం సేవించినప్పుడు శరీరంలో ప్రధానంగా రెండు మార్పులు జరుగుతాయి, ఇవే దోమలను మీ వద్దకు చేరుస్తాయి. మొదటిది, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత శరీర ఉష్ణోగ్రత (Body Temperature) స్వల్పంగా పెరుగుతుంది. దోమలు వేడిని చాలా త్వరగా పసిగట్టగలవు, కాబట్టి వెచ్చగా ఉన్న శరీరాన్ని అవి సులభంగా గుర్తిస్తాయి. రెండూ, మద్యం తాగిన వారి చర్మం ద్వారా వెలువడే చెమటలో మార్పులు వస్తాయి. ఆల్కహాల్ మెటబాలిజం వల్ల చర్మం నుంచి వెలువడే వాసన దోమలకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

శాస్త్రీయ పరిశోధనలు (Mosquitoes and Alcohol) ఏం చెబుతున్నాయి?
ఒక ఫ్రెంచ్ పరిశోధన ప్రకారం, కేవలం ఒక బీర్ తాగిన వ్యక్తిని కూడా దోమలు సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువగా కుడుతున్నట్లు తేలింది. మద్యం తాగిన వారి శ్వాసలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం , వారి చెమటలో ఉండే రసాయనాల మిశ్రమం దోమలను ఆకర్షించే సంకేతాలుగా పనిచేస్తాయి. సాధారణంగా దోమలు తమ ఆహారాన్ని వెతుక్కోవడానికి వాసన , వేడిపై ఆధారపడతాయి. మద్యం తాగిన వ్యక్తిలో ఇవి రెండూ ఎక్కువగా ఉండటంతో, వారు దోమలకు సులభమైన లక్ష్యంగా మారుతున్నారు.
Read Also : Tamil Nadu Elections : తమిళనాడు ఎన్నికల నగారా.. ఓటు హక్కు వినియోగించుకున్న కోలీవుడ్ స్టార్ హీరోలు.!
రక్త గ్రూపు , ఇతర అంశాల ప్రభావం
కేవలం మద్యం మాత్రమే కాదు, మన రక్త గ్రూపు కూడా దోమల కాటుపై ప్రభావం చూపుతుంది. ‘O’ గ్రూప్ రక్తం ఉన్నవారిని దోమలు ఎక్కువగా ఇష్టపడతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దీనికి తోడు మీరు మద్యం కూడా తాగి ఉంటే, దోమల దాడి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అలాగే ముదురు రంగు దుస్తులు ధరించడం, శరీరంలో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా విడుదల కావడం వంటివి కూడా దోమలను ఆకర్షించే ఇతర కారణాలు.
Read Also : Diet Mistakes : గుడ్డుతో కలిపి ఇవి తింటున్నారా..? ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త..!
జాగ్రత్తలు తప్పనిసరి
దోమల కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, సాయంత్రం వేళల్లో బయట మద్యం సేవించే వారు లేదా పార్టీల్లో పాల్గొనే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. దోమల నుంచి రక్షణ ఇచ్చే లోషన్లు రాసుకోవడం లేదా పూర్తిగా శరీరాన్ని కప్పే దుస్తులు ధరించడం ద్వారా ఈ ముప్పు నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు. మీరు మద్యం తాగుతున్నారంటే.. మీతో పాటు దోమలకు కూడా విందు ఇస్తున్నట్లేనని గుర్తుంచుకోండి..














