తాజా వార్తలు

Amit Shah: కేరళలో NDA వస్తే.. అమిత్ షా బిగ్ బ్లాస్ట్ హామీలు ఇవే!

amit-shah-kerala-promises.jpg

Amit Shah: కేరళ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఈ నెల 9న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు భారీ హామీలతో అన్నీ పార్టీలు ప్రచార హోరు సాగిస్తున్నాయి. ఈ తరుణంలో NDA హామీల పండగ వాతావరణం తీసుకొచ్చింది. మహిళలకు డైరెక్ట్ క్యాష్.. పండగలకి ఫ్రీ గ్యాస్.. రాష్ట్రానికి AIIMS.. ఇలా వరుస ప్రకటనలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది కేవలం హామీ కాదు.. ఓటర్లను టార్గెట్ చేసిన స్ట్రాంగ్ స్ట్రాటజీగా కనిపిస్తోంది.

మహిళల ఖాతాల్లో రూ. 2500..
మొత్తం ప్యాకేజ్‌లో హైలైట్ ఇదే. NDA ప్రభుత్వం కేరళలో ఏర్పడితే.. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ. 2500 జమ చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇది అమలు అయితే.. లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరట. ఒక్క మాటలో చెప్పాలంటే.. మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్ బాంబ్.

AIIMS.. 2 ఏళ్లలో రెడీ!
ఇప్పటివరకు కేరళలో AIIMS లేకపోవడం పెద్ద ఇష్యూ. ఇప్పుడు NDA క్లియర్ గ్యారంటీ ఇచ్చింది. మా ప్రభుత్వం వస్తే.. 2 సంవత్సరాల్లోనే కేరళలో మొదటి AIIMS రెడీ అని అమిత్ షా ప్రకటించారు. ఇది హెల్త్ సెక్టార్‌లో గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు.

Also Read: https://www.telugunews.co/janasena-mla-madhavi-organic-mango-farming/

పండగకి ఫ్రీ గ్యాస్!
ప్రతి సంవత్సరం ఓణం, క్రిస్మస్ సందర్భంగా.. 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. పండగ రోజుల్లో కుటుంబాలకు ఇది పెద్ద రిలీఫ్. సూటిగా చెప్పాలంటే పండగ అంటే ఖర్చు కాదు గవర్నమెంట్ గిఫ్ట్ గా చెప్పవచ్చు.

శబరిమల కేసుపై యాక్షన్ మోడ్
ఆధ్యాత్మికంగా కీలకమైన సబరిమల అంశాన్ని కూడా NDA టచ్ చేసింది. బంగారం దొంగతనం కేసును CBIకి అప్పగించి, 60 రోజుల్లో నిందితులను జైలుకు పంపిస్తామని అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది భక్తుల్లో భారీ చర్చకు దారి తీస్తోంది. ఈ ప్రకటనలతో కేరళ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది.

ఒకవైపు సంక్షేమం.. మరోవైపు స్ట్రాంగ్ యాక్షన్ హామీలు..
ఇది ఓటర్లపై ఎంత ప్రభావం చూపుతుందో ఇప్పుడు అందరి దృష్టి అదే మీద ఉంది. ఈ హామీలపై ప్రజల్లో మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొంతమంది “సూపర్ ప్యాకేజ్” అంటుంటే.. మరికొందరు “అమలు ఎలా?” అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్.. ఈ ప్రకటనలు ఇప్పుడు హాట్ టాపిక్!

మహిళలకు రూ. 2500.. AIIMS.. ఫ్రీ గ్యాస్.. శబరిమల యాక్షన్.. ఇలా వరుస హామీలతో NDA కేరళలో పండగ వాతావరణం క్రియేట్ చేసింది. ఇప్పుడు అసలు ప్రశ్న.. ఈ ప్యాకేజ్ ఓటర్లను ఆకట్టుకుంటుందా? లేక ఇది ఎన్నికల హామీల్లోనే మిగిలిపోతుందా? అది చూడాల్సిందే!

Share this post :

Facebook
WhatsApp
LinkedIn
Pinterest
X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
తాజా వార్తలు
కేటగిరీ

మా వార్తాలేఖను సబ్‌స్క్రైబ్ చేయండి!

సమాచారం, వినోదం, విశ్లేషణ – అన్నీ మీ ఇంటికే, ఒక్క క్లిక్‌తో.